ఖమ్మం రూరల్, జూన్ 08 : ఇటీవల వివిధ కారణాలతో అనారోగ్యం బారిన పడిన పలు కుటుంబాలను బీఆర్ఎస్ పార్టీ ఖమ్మం రూరల్ మాజీ అధ్యక్షుడు బెల్లం వేణుగోపాల్ స్థానిక నాయకులతో కలిసి పరామర్శించారు. సోమవారం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డులలో వేణుగోపాల్ పర్యటించారు. నాయుడుపేట మూడో వార్డుకు చెందిన సిపిఐ నాయకుడు పసుపులేటి లక్ష్మయ్య ఇటీవల అనారోగ్యానికి గురై చికిత్స అనంతరం ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్నాడు. అదేవిధంగా మత్స్య కార్మికుడు పడిగేలా నరసయ్య చేపల వేటకు వెళ్లి ప్రమాదానికి గురయ్యాడు. విషయం తెలుసుకున్న వేణుగోపాల్ స్వయంగా వారి ఇండ్లకు వెళ్లి పమర్శించారు. ప్రమాదాలకు కారణాలను అడిగి తెలుసుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని, అధైర్యం చెందొద్దని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ స్థానిక నాయకులు బానోతు రెడ్యా నాయక్, శీలం రవికుమార్, నాశబోయిన కనకయ్య, మానుకొండ శ్రీనివాస్, కీర్తి వెంకన్న, కోకిల రామారావు, కొట్టే నాగభూషణం, గుడిసె సైదులు, గూడేల్లి అభి పాల్గొన్నారు.

ఏదులాపురంలో పలు కుటుంబాలకు బీఆర్ఎస్ నాయకుల పరామర్శ