వైరా, ఆగస్టు 21 : బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా నాయకుడు కొత్త వెంకటేశ్వరరావు జన్మదిన వేడుకలను వైరా పట్టణ కార్యాలయంలో పార్టీ శ్రేణులు శుక్రవారం ఘనంగా నిర్వహించాయి. కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు, కార్యకర్తలు మాట్లాడుతూ వెంకటేశ్వరరావు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలు, అష్ట ఐశ్వర్యాలతో ఉండాలని ఆకాక్షించారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా నాయకుడు కట్ట కృష్ణార్జునరావు, వర్తక సంఘం నాయకుడు వనమా విశ్వేశ్వరరావు, 8వ వార్డు కౌన్సిలర్ చిలకా చిన్న కోటయ్య, వైరా పట్టణ మాజీ అధ్యక్షుడు అప్పం సురేశ్, పట్టణ మహిళ మాజీ అధ్యక్షురాలు బానోత్ సక్కుబాయి, డాక్టర్ పెరుమాళ్ల కృష్ణమూర్తి, నూకల వాసు, ఆర్యవైశ్య సంఘం వైరా మండలాధ్యక్షుడు మిట్టపల్లి కిరణ్, కామినేని శ్రీనివాసరావు, అయినల కనకరత్నం, రామకృష్ణ, వజినేపల్లి చక్రవర్తి, ఆదూరి ప్రేమ్, కారుకొండ బోసు, దొంతేబోయిన చింతయ్య, బొగ్గుల శ్రీనివాస్ రెడ్డి, పూర్ణకంటి దాసు, వరపర్ల సంసోను, మాచర్ల శంకర్, నాయి బ్రాహ్మణ సంఘం మండలాధ్యక్షుడు ఉప్పె వెంకటేశ్వర్లు, బత్తుల లింగారావు, బండారు వాసు, దేవుళ్ల శ్రీను, ఏలూరు నరసింహారావు, కొత్తపల్లి సురేశ్, ఇనపనూరి క్రాంతి, రేచర్ల సైదులు, పనితి శాంతయ్య పాల్గొన్నారు.