బెంగళూరు : జనతాదళ్ మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ తీరు మరోసారి చర్చనీయాంశంగా మారింది. బెంగళూరులోని పరప్పణ అగ్రహార సెంట్రల్ జైల్లో ఉంటున్న రేవణ్ణ మొబైల్లో డజన్ల కొద్దీ పోర్న్ వీడియోలు బయటపడ్డాయి. ఆగస్టు 11న ఈ జైల్లో క్రైమ్ బ్రాంచ్ అధికారులు ఆకస్మిక దాడులు జరపగా.. రేవణ్ణ ఉంటున్న హై సెక్యూరిటీ బ్యారెక్‌లో మొబైల్ ఫోన్, పెన్‌డ్రైవ్, నోట్ బుక్‌తో పాటు చార్జర్ స్వాధీనం చేసుకున్నారు.
మొబైల్ ఫోన్‌ను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించగా డజన్ల కొద్దీ పోర్న్ వీడియోలు బయటపడ్డాయి. అలాగే వాట్సాప్ నుంచి వీడియో కాల్స్ చేసినట్టు అధికారులు గుర్తించారు. కొందరు మహిళలను కూడా ఫోన్ కాల్స్ ద్వారా సంప్రదించినట్టు అందులో తేలింది. దీంతో వీఐపీలకు జైళ్లలో అందుతున్న సౌకర్యాలపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.