Harish Rao : రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు(Harish Rao) మరోసారి ఫైరయ్యారు. నిషేధిత జాబితాలోని భూములకు సంబంధించిన 22A గురించి బీఆర్ఎస్ లేవనెత్తిన ఒక్క ఆరోపణకు కూడా పొంగులేటి సమాధానం చెప్పలేదని హరీశ్ రావు మండిపడ్డారు. శనివారం తెలంగాణ భవన్లో మీడియా సమావేశం నిర్వహించిన ఆయన.. తన మామపై వస్తున్న భూకుంభకోణం వార్తల్ని ఖండించారు.
న 2025 డిసెంబర్ నెలలో మేము అప్లోడ్ చేసిన ఒక జాబితా వల్లే ఈ తప్పు జరిగిందని అసెంబ్లీ సాక్షిగా పొంగులేటి ఒప్పుకున్నాడని హరీశ్ వెల్లడించారు. ప్రజలను ఇబ్బంది పెట్టినందుకు క్షమాపణ చెప్తాడని, 22A ద్వారా నిషేధిత జాబితాలో పెట్టిన భూములు ఎప్పుడు తొలగిస్తారో చెప్తాడు అనుకున్నామని, కానీ ఆయనలో కనీస పశ్చాతాపం లేదని హరీశ్ రావు ధ్వజమెత్తారు.
22A గురించి బీఆర్ఎస్ లేవనెత్తిన ఒక్క ఆరోపణకు కూడా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సమాధానం చెప్పలేదు
2025 డిసెంబర్ నెలలో మేము అప్లోడ్ చేసిన ఒక లిస్ట్ వల్లే ఈ తప్పు జరిగిందని అసెంబ్లీ సాక్షిగా పొంగులేటి ఒప్పుకున్నాడు
ప్రజలను ఇబ్బంది పెట్టినందుకు క్షమాపణ చెప్తాడు, 22A ద్వారా నిషేధిత… pic.twitter.com/sbP3uOK85B
— Telugu Scribe (@TeluguScribe) September 12, 2026
అంతేకాదు తన మామ భూకుంభకోణానికి పాల్పడ్డాడు అంటూ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేసిన ఆరోపణలకు హరీష్ రావు ఇచ్చారు. మా మామ ఏదో భూ కుంభకోణం చేశాడని పొంగులేటి చెప్తున్నాడని, కానీ, అదంతా కట్టుకథ అని ఆయన పేర్కొన్నారు. ‘మా మామ హనుమంతరావు రిటైర్డ్ బ్యాంకు అధికారి. ఆయన చెక్ ఇచ్చి చట్టబద్ధంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఎక్స్ సర్వీస్ మెన్ సత్యనారాయణకు 1995లో అప్పటి ప్రభుత్వం ఆ భూమి అలాట్ చేసింది.
ఆ తర్వాత 2010లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే NOC ఇచ్చింది. ఆ భూమిని అదే కాంగ్రెస్ ప్రభుత్వంలో మా మామ రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. ఆ భూమి రూ.15 కోట్లు అని పొంగులేటి చెప్తున్నాడు, రూ.50 లక్షలు ఇచ్చి భూమి తీసుకో నువ్వే. మిషన్ భగీరథలో మా కుటుంబ సభ్యుల భూమి పోతే డబ్బులు ఇచ్చారు అన్నాడు. ఆ భూమి పోయింది గోదావరి సృజల స్రవంతి అనే కార్యక్రమంలో. అది కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలోనే. నీ కొడుకు బాగోతం, రేవంత్ రెడ్డి బాగోతం కప్పిపుచ్చడానికి నా మీద బురద చల్లుతున్నావు. ఇప్పుడు అధికారంలో ఉన్నది నువ్వే కదా, తప్పు చేస్తే చర్యలు తీసుకో’ అని హరీశ్ రావు సవాల్ విసిరారు.
తనపై పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేసిన ఆరోపణలకు కౌంటర్ ఇచ్చిన హరీష్ రావు
మా మామ ఏదో భూ కుంభకోణం చేశాడని పొంగులేటి చెప్తున్నాడు
1995లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఓ వ్యక్తి భూమి కొనుక్కున్నాడు, 2010లో అదే కాంగ్రెస్ ప్రభుత్వం NOC ఇచ్చింది
ఆ భూమిని అదే కాంగ్రెస్ ప్రభుత్వంలో మా… pic.twitter.com/FFRhLbfUpK
— Telugu Scribe (@TeluguScribe) September 12, 2026