చెన్నై : తమిళనాడులో ద్విభాషా విధానంపై మరోసారి చర్చ మొదలైంది. ఇటీవల తూత్తుకుడి జిల్లాలోని సాత్తాస్కులం-నాజరేత్ జిల్లాల మధ్య రాష్ట్ర రహదారి ఎస్హెచ్-93 వెంబడి.. తమిళం, ఇంగ్లిష్తో పాటు హిందీలో ఉన్న సూచిక బోర్డులను అధికారులు ఏర్పాటు చేశారు.
ఈ విషయం కాస్తా ప్రభుత్వం దృష్టికి వెళ్లింది. దీంతో రహదారుల శాఖకు చెందిన ఇద్దరు అసిస్టెంట్ ఇంజినీర్లను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. అలాగే ఆ బోర్డుల మీద హిందీ భాషలోని పదాలను అధికారులు తొలగించారు. ఇక నుంచి ప్రభుత్వ అధికారులు ఎవరైనా ద్విభాషా విధానాన్ని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం విజయ్ ప్రభుత్వం వెల్లడించింది.