న్యూఢిల్లీ : అల్‌ఖైదా ఉగ్రవాద సంస్థ వ్యవస్థాపకుడు బిన్ లాడెన్ కుమారుడి వీడియో ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా సంచలనంగా మారింది. 7 ఏండ్ల తర్వాత అల్‌ఖైదా అతని వీడియో విడుదల చేయడంతో.. ఏడేండ్ల క్రితమే చనిపోయాడనుకున్న హమ్జా జీవించే ఉన్నాడనే సంకేతాలు వినిపిస్తున్నాయి.
సెప్టెంబర్ 11న అమెరికాలో అల్‌ఖైదా చేసిన అతిభయంకరమైన ఉగ్ర దాడులకు శుక్రవారంతో 25 ఏండ్లు పూర్తవుతున్న సందర్భంగా ఆ సంస్థ ‘ఎ క్వార్టర్ సెంచరీ ఆఫ్ 11 సెప్టెంబర్ రైడ్స్’ పేరుతో ఈ వీడియోను రిలీజ్ చేసింది. ఈ వీడియోలో హమ్జా ఓ పాత గోడ ముందు అల్‌ఖైదా గురించి మాట్లాడుతుండటం కనిపిస్తున్నది.