KCR Camp Office | ఇల్లెందు, ఏప్రిల్ 5: తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకులు, గజ్వేల్ నియోజకవర్గ శాసనసభ్యులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు క్యాంప్ ఆఫీసుపై కాంగ్రెస్ గూండాల దాడికి నిరసనగా బీఆర్ఎస్ నాయకులు దిండిగాల రాజేందర్ ,పార్టీ శ్రేణులు. నల్ల జెండాలతో నిరసన తెలిపారు. క్యాంప్ ఆఫీసుపై కాంగ్రెస్ గూండాల దాడికి నిరసనగా ఆదివారం నల్ల జెండాలతో నిరసన ర్యాలీని దిండిగాల రాజేందర్ ఆధ్వర్యంలో తెలంగాణా తల్లి (జగదాంబ) సెంటర్ లో నల్ల బ్యాడ్జీలతో నిరసన ప్రదర్శన నిర్వహించారు.
ఈ సందర్భంగా రాజేందర్ మాట్లాడుతూ.. కేసీఆర్ క్యాంపు కార్యాలయం అంటే ప్రభుత్వం ప్రతిపక్ష నాయకునికి కేటాయించిన సెమి రెసిడెంట్.. కుంటి సాకులతో దానిపై దాడికి దిగి ధ్వంసం చేసి భీభత్సం సృష్టించడమంటే ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించడమేనని… అంటే తెలంగాణా జాతిపిత తెలంగాణా తొలి ముఖ్యమంత్రి పై చేసిన దాడి, అంతేకాదు యావత్ తెలంగాణా జాతి మీద జరిగిన దాడి ఇది. స్వయంగా ముఖ్యమంత్రి హోమ్ శాఖ మంత్రిగా ఉన్న రాష్ట్రంలో పట్టపగలు కాంగ్రెస్ గుండాలు ప్రయివేట్ సైన్యంలా వ్యవహరిస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నట్లు ప్రశాంతంగా అభివృద్ధికి నిలయమైన తెలంగాణాలో ఈ అరాచకం ఏమిటి. గజ్వేల్ రాజకీయ పరిణామలు రాష్ట్రంలో ప్రజా వాగ్దానాలను నెరవేర్చడంలో విఫలమైన రేవంత్ సర్కార్ చిల్లర పనులతో చిల్లర రాజకీయాలు చేస్తుంది.
సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి.. ?
మాజీ ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంపై వందల మంది చూస్తుండగా పట్టపగలు ఇలాంటి చర్యలకు పాల్పడితే ఇక సామాన్య ప్రజల పరిస్థితి ఏంటని ఆయన ప్రశ్నించారు.ఈ సందర్భంగా పోలీసులు ప్రేక్షక పాత్ర వహించడం శోచనీయమని రాజేందర్ విమర్శించారు. దాడికి పాల్పడిన కాంగ్రెస్ దుండగులను వెంటనే గుర్తించి,అరెస్టు చేసి చట్టపరంగా కఠినంగా శిక్షించాలని రాజేందర్ డిమాండ్ చేసారు.
పట్టణ అధ్యక్షుడు ఎండీ అబ్దుల్ జబ్బార్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో నాయకులు ఎస్. రంగనాధ్, సిలివేరు సత్యనారాయణ, శీలం రమేష్ , ఎస్కే అబ్దుల్ నబి , భావ్ సింగ్ ,13వ. వార్డు కౌన్సిలర్ దండు సారయ్య , సుదిమళ్ళ సర్పంచ్ సుగుణయ్య ,డెరంగుల పోశం ,సుందరగిరి శ్రీనివాస్ , దాస్యం ప్రమోద్, ఎస్కే గాజి , మాజీ కౌన్సిలర్ వాసు , లక్ష్మీనర్సయ్య ,నారపాక వసంతరావు , సన రాజేష్, కొక్కు సరిత, నారాయణమ్మ, బజారు సత్యనారాయణ, టీ మహేష్, రాచపల్లి శ్రీను, ఎం ఉపేందర్, పెర్కపల్లి శ్రీను, ఎస్కే ఇమ్రాన్, గోల్డ్ ఇమ్రాన్, రసూల్, కిషన్ పాసి, లలిత్ పాసి, పట్టణ, మండల కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు.

