కూసుమంచి, ఏప్రిల్ 25: ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాలనే లక్ష్యంతో పుట్టిన పార్టీ బీఆర్ఎస్ అని ఎమ్మెల్యే కందాళ ఉపేందర్‌రెడ్డి అన్నారు. పాలేరులో పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మంగళవారం పార్టీ జెండాను ఆవిష్కరించి మాట్లాడారు. టీఆర్ఎస్గా ఉన్న పార్టీ నేడు జాతీయ స్థాయిలో బీఆర్ఎస్గా మారి మిగిలిన రాష్ర్టాల్లోనూ అంచలంచెలుగా ఎదుగుతున్నదన్నారు. ఎంపీపీ బానోత్ శ్రీనివాస్, ఆత్మ చైర్మన్ రామసహాయం బాలకృష్ణా రెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ ఇంటూరి శేఖర్, మం డల అధ్యక్షుడు వేముల వీరయ్య, నాయకులు అద్దంకి ఉపేంద్రాచారి, దాసరి బాలకృష్ణ, రంజాన్, బత్తుల ఉప్పయ్య, రాము తదితరులు పాల్గొన్నారు.
కూసుమంచిలో..
కూసుమంచి, ఏప్రిల్ 25: బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వాడవాడలా పార్టీ జెండాలను నాయకులు ఎగుర వేశారు. నాయకన్‌గూడెంలో గ్రామశాఖ అధ్యక్షుడు జహంగీర్ షరీఫ్ జెండాను ఎగుర వేశారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ కంచర్ల పద్మారెడ్డి, సర్పంచ్ కాసాని సైదులు, నాయకులు కంచర్ల వీరారెడ్డి, వీరనాగులు, కిన్నెర శ్రీకాంత్ పాల్గొన్నారు. జీళ్లచెరువు, కూసుమంచి, కేశ్వాపురం గ్రామాల్లో పార్టీ జెండాను ఎగుర వేశారు.
తిరుమలాయపాలెంలో..
తిరుమలాయపాలెం, ఏప్రిల్ 25: మండలంలోని గ్రామాల్లో నాయకులు బీఆర్ఎస్ జెండాను ఆవిష్కరించారు. జల్లేపల్లిలో మండల అధ్యక్షుడు బాషబోయిన వీరన్న, కొక్కిరేణిలో డీసీసీబీ డైరెక్టర్ చావా వేణు, ఏలువారిగూడెంలో దేవరం దేవేందర్‌రెడ్డి, సుబ్లేడులో పోలెపొంగు రామచంద్రు, గోల్‌తండాలో బానోత్ రంగ, సోలీపురంలో హలావత్ శ్రీను, పిండిప్రోలులో పరికపల్లి చంద్రశేఖర్ జెండాను ఆవిష్కరించారు. నాయకులు పాల్గొన్నారు.
బోనకల్లులో..
బోనకల్లు, ఏప్రిల్ 25: మండలంలోని 22 గ్రామా ల్లో ఆ గ్రామ అధ్యక్షులు బీఆర్ఎస్ జెండాలను ఆవిష్కరించారు. మండల అధ్యక్షుడు చేబ్రోలు మల్లికార్జునరావు, మండల రైతు కన్వీనర్ వేమూరి ప్రసాద్, శ్రీనివాసరావు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ దేశ వ్యాప్తంగా వ్యాపిస్తుందన్నారు. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, అనుబంధ సంఘ నాయకులు పాల్గొన్నారు.
చింతకానిలో..
చింతకాని, ఏప్రిల్ 25: మండలంలోని 26 గ్రామాల్లో బీఆర్ఎస్ నాయకులు బీఆర్ఎస్ జెండాలను ఆవిష్కరించి స్వీట్లు పంచారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు పెంట్యాల పుల్లయ్య మాట్లాడుతూ తెలంగాణ ఖ్యాతిని విశ్వానికి చాటిచెప్పిన ఘనుడు సీఎం కేసీఆర్ అని అన్నారు. కార్యక్రమాల్లో నాయకులు వంకాయలపాటి సత్యనారాయ ణ, గురజాల హనుమంతరావు, బొడ్డు వెంకట్రామయ్య, బొగ్గారపు రాంబాబు, గడ్డం శ్రీను, నూతలపాటి వెంకటేశ్వర్లు, కాండ్ర పిచ్చయ్య, వేముల నర్సయ్య, బండి సుభద్ర, కాళంగి లలిత, ప్రజాప్రతినిధులు, రైతుబంధుసమితి నాయకులు, సొసైటీ చైర్మన్లు పొల్గొన్నారు.
ఎర్రుపాలెంలో..
ఎర్రుపాలెం, ఏప్రిల్ 25: స్థానిక బీఆర్ఎస్ కార్యాలయంలో బీఆర్ఎస్ జెండాను ఎంపీపీ దేవరకొండ శిరీష ఆవిష్కరించారు. ఆయా గ్రామశాఖల ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు జెండాలను ఎగురవేశారు. మండల అధ్యక్షుడు పంబ సాంబశివరావు, ఏఎంసీ మాజీ చైర్మన్ చావా రామకృష్ణ, నాయకులు అప్పారావు, కొండపాటి సాంబశివరావు, మస్తాన్‌వలీ, శ్రీనివాసరెడ్డి, తిరుపతిరావు, పుల్లారెడ్డి, చిరంజీవి, పవన్, హుస్సేన్, రవి, కార్యకర్తలు పాల్గొన్నారు.
కూసుమంచి రూరల్‌లో..
కూసుమంచి రూరల్, ఏప్రిల్ 25: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపుమేరకు మండలంలోని అన్ని గ్రామాల్లో పార్టీ శ్రేణులు మంగళవారం గులాబీ జెండాలు ఎగురవేశారు. కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
నేలకొండపల్లిలో..
నేలకొండపల్లి, ఏప్రిల్ 25: మండల వ్యాప్తంగా గ్రామగ్రామాన పార్టీ ఆవిర్భావ వేడుకలను జరుపుకున్నారు. ముజ్జుగూడెంలో మండల అధ్యక్షుడు ఉన్నం బ్రహ్మయ్య, భైరవునిపల్లిలో జడ్పీ వైస్ చైర్మన్ మరికంటి ధనలక్ష్మి, పైనంపల్లిలో డీసీఎంఎస్ డైరెక్టర్ నాగుబండి శ్రీనివాసరావు, మండ్రాజుపల్లిలో ఎంపీపీ వజ్జా రమ్య పార్టీ జెండాలను ఎగురవేసారు. కార్యక్రమాల్లో సర్పంచులు, ఎంపీటీసీలు, అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
మధిర రూరల్‌లో..
మధిరరూరల్, ఏప్రిల్ 25: బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని మండలంలోని అన్ని గ్రామాల్లో ఆయా గ్రామాల సర్పంచ్‌లు, గ్రామ అధ్యక్షులు బీఆర్ఎస్ జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఖమ్మం రూరల్‌లో..
ఖమ్మం రూరల్, ఏప్రిల్ 25: మండలంలోని 29 గ్రామపంచాయతీల్లో బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షులు పార్టీ జెండాలను ఆవిష్కరించారు. కార్యకర్తలు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు మండల కేంద్రంలో జరిగిన పార్టీ ప్రతినిధుల సభకు హాజరయ్యారు.