ఖమ్మం రూరల్, ఏప్రిల్ 20 : జగిత్యాల జిల్లా కేంద్రంలో జరగబోయే జగిత్యాల జైత్రయాత్ర (కేసీఆర్ ఆశీర్వాద సభ) కు ఖమ్మం రూరల్ మండలం గూడూరుపాడు బీఆర్ఎస్ గ్రామ శాఖ ముఖ్య నాయకులు బయల్దేరి వెళ్లారు. సోమవారం ఉదయం గ్రామం నుండి బయల్దేరిన వాహనాలను బీఆర్ఎస్ నాయకులు అల్లిక వెంకటేశ్వరరావు, అమ్మిరాజు ప్రారంభించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర రాజకీయాలను జగిత్యాల సభ మార్చబోతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఎవరెన్ని కుట్రలు, కుతంత్రాలు పన్నిన కేసీఆర్ సభ వందకు వందశాతం విజయవంతం అవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ గ్రామ శాఖ బాద్యులు పాల్గొన్నారు.