వైరా రూరల్, సెప్టెంబర్ 24: బీఆర్ఎస్ గెలుపే ధ్యేయంగా నాయకులు, కార్యకర్తలు పనిచేయాలని పార్టీ వైరా నియోజకవర్గ అభ్యర్థి బానోత్ మదన్‌లాల్ పిలుపునిచ్చారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని కోరారు. వైరా మండలంలోని రెబ్బవరం గ్రామంలో ఆదివారం పర్యటించిన ఆయన.. తొలుత అక్కడ చర్చీలో జరుగుతున్న ప్రార్థనా కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా చర్చీ ఫాదర్ సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికి సన్మానించారు. ఆకుల రాజు ఏర్పాటు చేసిన ఈ ప్రార్థన కార్యక్రమంలో పాల్గొన్న మదన్‌లాల్.. మేరీమాత విగ్రహాలకు పూలమాల వేసి పూజించారు. అనంతరం సర్పంచ్ సాదం రామారావు ఇంటి వద్ద జరిగిన తేనేటి విందు కార్యక్రమంలో మాట్లాడారు.
కార్యకర్తలందరూ కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. పార్టీ బలోపేతమే లక్ష్యంగా, ఎన్నికల్లో విజయమే ధ్యేయంగా ముందుకుసాగాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన పథకాల ఫలాలను అందుకున్న లబ్ధిదారుల ఇళ్లకు ప్రభుత్వ ఆశయం గురించి వివరించాలని సూచించారు. బీఆర్ఎస్ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు బాణాల వెంకటేశ్వర్లు, సాదం రామారావు, ఆకుల రాజు, మెండెం కృష్ణంరాజు, కొత్తా వెంకటేశ్వరరావు, మాదినేని దుర్గాప్రసాద్, డాక్టర్ పెరుమాళ్ల కృష్ణమూర్తి, దొంతెబోయిన వెంకటేశ్వర్లు, కిలారి శ్రీనివాసరావు, వనమా చిన్ని, మేదరమెట్ల రాము, దొంతబోయిన వెంకటనారాయణ, కోసూరు రామకృష్ణ, వేల్పుల నారాయణ, సింగవరపు నరేశ్, కామ సురేశ్, సరిపూడి కోటేశ్వరరావు, యండ్రాతి గోపాలరావు, ఏలూరు నర్సింహారావు తదితరులు పాల్గొన్నారు.