– బీఆర్ఎస్ 23 స్థానాలు, సీపీఎం ఎనిమిది స్థానాల్లో పోటీ
ఖమ్మం రూరల్, ఫిబ్రవరి 03 : ఖమ్మం జిల్లా ఏదులాపురం మున్సిపాలిటీకి సంబంధించిన బీఆర్ఎస్ సీపీఎం కూటమికి సంబంధించిన అభ్యర్థుల పేర్లను ఆ పార్టీ నేతలు మంగళవారం అధికారికంగా విడుదల చేశారు. నామినేషన్ ఉప సంహరణ గడువు ముగిసిన అనంతరం తుది జాబితాను వారు ప్రకటించారు. మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 32 వార్డులు ఉండగా 15వ వార్డు ఏకగ్రీవం కావడంతో మిగిలిన 31 వార్డులకు ఎన్నికలు అనువార్యం అయ్యాయి. వీటిలో బీఆర్ఎస్ పార్టీ 23 స్థానాల్లో పోటీ చేస్తుండగా సీపీఎం మిగిలిన ఎనిమిది స్థానాల్లో పోటీలో నిలిచింది. వార్డుల వారిగా పరిశీలిస్తే 1వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థిగా దుంపల నాగరాజ్, 2వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థిగా పల్లపు సంధ్య, 3వ వార్డు సిపిఎం అభ్యర్థిగా మేడబోయిన నాగమణి, 4వ వార్డు అభ్యర్థిగా బీఆర్ఎస్ అభ్యర్థి చీరాల రమణ, 5వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థి బానోత్ మోహన్, 6వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థి ఇంజన్ మాలతి, 7వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థి బొల్లం నాగయ్య, 8వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థి బెండు జ్యోతి, 9వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థి కొట్టి రమాదేవి, 10వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థిగా పెరుమల్లపల్లి మరియమ్మ, 11వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థి రమాదేవి, 12వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థి మేకల సత్యనారాయణ, 13వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థిగా కొత్తపల్లి విశ్వేశ్వరరావు,
14వ వార్డు సిపిఎం అభ్యర్థిగా మేడపల్లి వెంకన్న, 16వ వార్డు సిపిఎం అభ్యర్థిగా పగిళ్లపల్లి ఉపేందర్, 17వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థిగా కర్లపూడి ఇందిరా, 18వ వార్డు సిపిఎం అభ్యర్థిగా పొన్నెకంటి బాలమ్మ, 19వ వార్డు సిపిఎం అభ్యర్థిగా ధనియాకుల మల్లిక, 20వ వార్డు సిపిఎం అభ్యర్థిగా గుది మల్లయ్య, 21వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థిగా బత్తిని మంగమ్మ, 22వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థి గూడా సంజీవరెడ్డి, 23వ వార్డు అభ్యర్థిగా బీఆర్ఎస్ అభ్యర్థి అడ్డాకుల శారద, 24వ వార్డు అభ్యర్థిగా సిపిఎం అభ్యర్థి బానోత్ శ్రీకాంత్, 25వ వార్డు అభ్యర్థిగా బీఆర్ఎస్ పార్టీకి చెందిన నాశబోయిన కనకయ్య, 26వ వార్డు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా బానోత్ జ్యోతి, 27వ వార్డు అభ్యర్థిగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బానోతు రెడ్డియా నాయక్, 28వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థిగా మైబెల్లి సాహెబ్, 29వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థిగా వెంపటి మాధవి, 30వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థిగా రామిశెట్టి విద్యావతి, 31వ వార్డు సిపిఎం అభ్యర్థిగా పోరాడే హైమావతి, 32వ వార్డు సిపిఎం అభ్యర్థిగా గడ్డం వీరబాబు బరిలో ఉన్నారు.