గజ్వేల్ ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గురువారం హైదరాబాద్‌లోని అసెంబ్లీలో స్పీకర్ గడ్డం ప్రసాద్ సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ తాతా మధు, ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, మాజీ ఎమ్మెల్యేలు సండ్ర వెంకట వీరయ్య, మెచ్చా నాగేశ్వరరావు, కందాళ ఉపేందర్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర.. కేసీఆర్‌ను మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.