సంస్థాన్ నారాయణపురం, సెప్టెంబర్ 29: ‘కరెంట్ కనెక్షన్ ఇవ్వండి సారూ.. పది నెలలుగా విద్యుత్తు కార్యాలయం చూట్టూ కాళ్లు అరిగేలా తిరుగుతున్నా’ సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రానికి చెందిన రైతు చిలువేరు మహేశ్ వేడుకుం టున్నాడు. ఆయనతో పాటు ఇద్దరు రైతులు కరెంట్ కలెక్షన్ కోసం నాలుగు డీడీలతోపాటు ఎస్టిమేట్ కింద రూ.63,769 చెల్లించారు. డీడీలు కట్టి పది నెలలు గడుస్తున్నా అధికారులు కరెంట్ కనెక్షన్ ఇవ్వకుండా..
రేపు, మాపు అంటూ కార్యాలయం చుట్టూ తిప్పించుకోవడంతో విసిగిపోయిన రైతులు అధికారులతో గొడవపడ్డారు. దీంతో నెల క్రితం విద్యుత్తు స్తం భాలు, ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేసి కనెక్షన్ ఇవ్వకుండా వదిలేశారు. వైర్లు, మరో 2 స్తంభాలు తెచ్చుకోవాలని అధికారులు చెప్పడంతో కంగుతిన్నారు. ఈ విషయమై విద్యుత్తు ఏఈని వివరణ కోరగా.. రైతు కరెంటు కనెక్షన్ కోసం లంచం ఇచ్చిన విషయం తన దృష్టికి రాలేదని చెప్పారు.