భావితరం బాగు కోసం నిలబడతా..
కొత్తగూడెం నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి వనమా వెంకటేశ్వరరావు జోరుగా ఎన్నికల ప్రచారం నిర్వహిసున్నారు. చిన్నాపెద్దా అందరినీ కలిసి ఓట్లు అభ్యర్థిస్తున్నారు. శనివారం కొత్తగూడెంలో చంటిబిడ్డను ఎత్తుకుని ఇలా మురిపెంగా ఫొటో దిగారు.
– కొత్తగూడెం అర్బన్, నవంబర్ 25
పల్లె పల్లెనా గులాబీ దండు..
తల్లాడ మండలంలోని పలు గ్రామాల్లో శనివారం బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి సండ్ర వెంకటవీరయ్య ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామగ్రామాన ఆయనకు ఘనస్వాగతం లభించింది. గులాబీ శ్రేణులు ఆయన వెన్నంటే ఉంటూ ఓటర్లను ఓట్లు అభ్యర్థించారు. పార్టీ మ్యానిఫెస్టోను వివరించాయి.
– తల్లాడ, నవంబర్ 25
మీకోసం కదిలి వస్తున్నా..
ఏజెన్సీ నియోజకవర్గమైన పినపాకలో గులాబీ సేన ఎన్నికల ప్రచారం జోగా సాగుతున్నది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి రేగా కాంతారావు గ్రామగ్రామానికీ వెళ్లి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. బీఆర్ఎస్ మ్యానిఫెస్టోను వివరిస్తూ ఓట్లు అభ్యర్థించారు. శనివారం అశ్వాపురం మండలం బుడ్డవారిగుంపులో పాదయాత్ర చేశారు. – అశ్వాపురం, నవంబర్ 25
అవ్వా.. కారు గుర్తుకు ఓటెయ్ !
ఎన్నికల ప్రచార గడువు దగ్గరకొస్తుండడంతో ఖమ్మం నగరంతో పాటు రఘునాథపాలెం మండలంలో ఉధృతంగా ప్రచారం చేస్తున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పువ్వాడ అజయ్‌కుమార్. దీనిలో భాగంగా శనివారం నగరంలో ఓ అవ్వను ఓటు అభ్యర్థిస్తూ అజయ్‌కుమార్ ఇలా కనిపించారు.
– ఖమ్మం, నవంబర్ 25
మీ బిడ్డనై పోటీ చేస్తున్నా.. ఆశీర్వదించండి
ఇల్లెందు నియోజకవర్గంలో శనివారం గులాబీ సేన ఎన్నికల ప్రచారం హోరెత్తింది. ఎమ్మెల్యే అభ్యర్థి బానోతు హరిప్రియానాయక్ టేకులపల్లి మండల వ్యాప్తంగా పర్యటించారు. ఐదేళ్లలో చేసిన అభివృద్ధిని వివరిస్తూ ముందుకు సాగారు.
– టేకులపల్లి, నవంబర్ 25
మన తండా.. మన రాజ్యమే రామక్క..
పాలేరు నియోజకవర్గంలో గులాబీ శ్రేణులు విస్తృతంగా పర్యటించి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కందాళ ఉపేందర్‌రెడ్డి శనివారం కూసుమంచి మండల వ్యాప్తంగా పర్యటించి రోడ్ షో నిర్వహించారు. లోక్యాతండాలో గిరిజనులతో కలిసి నృత్యం చేస్తూ కనిపించారు.
– కూసుమంచి, నవంబర్ 25
నేను ‘మెచ్చా’ను మాట్లాడుతున్నా..
అశ్వారావుపేట మండలంలో శనివారం బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి మెచ్చా నాగేశ్వరరావు విస్తృతంగా పర్యటించారు. గ్రామగ్రామాన ఇంటింటికీ వెళ్లి వారి సమస్యలు తెలుసుకున్నారు. అల్లీగూడెం గ్రామస్తులు వీధి దీపాల సమస్యను ప్రస్తావించగా వెంటనే ఆయన సంబంధిత అధికారులకు కాల్ చేసి సమస్యను పరిష్కరించాలని సూచించారు.
– అశ్వారావుపేట, నవంబర్ 25
అమ్మా.. బీఆర్ఎస్కు ఓటేయండి
బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి మదన్లాల్వైరా నియోజకవర్గంలో శనివారం ఎన్నికల ప్రచారం నిర్వహిచారు. ఆయనకు గ్రామగ్రామాన ఘన స్వాగతం లభించింది. చిన్నాపెద్దా అందరినీ పలుకరిస్తూ మదన్‌లాల్ ఓట్లు అభ్యర్థించారు
. – వైరా రూరల్, నవంబర్ 25
జై.. జై.. బీఆర్ఎస్ జెండా
మధిర నియోజకవర్గ పరిధిలోని బోనకల్లు మండలంలో శనివారం బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి లింగాల కమల్‌రాజు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తన ప్రసంగంతో గులాబీ శ్రేణులను ఉత్సాహపరుస్తూ ఫొటోకు స్టిల్ ఇచ్చారు.
– బోనకల్లు, నవంబర్ 25
అవ్వా.. పింఛను పెంచుతం.. మంచిగ చూస్తం..
భద్రాచలం ఏజెన్సీలో గులాబీ సేన ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతున్నది. బీఆర్ఎస్ మ్యానిఫెస్టోను వివరిస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. ప్రచారంలో భాగంగా శనివారం ఎమ్మెల్యే అభ్యర్థి తెల్లం వెంకట్రావు ఇలా ఓ అవ్వను ఆప్యాయంగా పలుకరిస్తూ కనిపించారు.
– భద్రాచలం, నవంబర్ 25