నామినేషన్ల గడువుకు ముందే బీఆర్ఎస్ అభ్యర్థుల ప్రచారం టాప్ గేర్‌లో సాగుతోంది. బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ఉమ్మడి జిల్లాలోని పది నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించిన నాటి నుంచి ఎడతెరిపి లేకుండా అభ్యర్థులతోపాటు వారి కుటుంబ సభ్యులు ప్రచారం చేస్తున్నారు. ఖమ్మంలో మంత్రి పువ్వాడ సతీమణి వసంతలక్ష్మి, పాలేరులో కందాళ ఉపేందర్‌రెడ్డి సతీమణి విజయమ్మ, ఇద్దరు కుమార్తెలు దీపిక, దీప్తి, మధిరలో లింగాల కమల్‌రాజు కూతురు అభిజ్ఞ వాడవాడలా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. నియోజకవర్గంలోని ఊరూరా.. ఇంటింటికీ తిరుగుతూ తొమ్మిదిన్నరేళ్ల కాలంలో సీఎం కేసీఆర్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను గుర్తు చేస్తూ.. కారు గుర్తుకు ఓటు వేయాలని బీఆర్ఎస్ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు అభ్యర్థిస్తున్నారు. సీఎం కేసీఆర్ ఇప్పటికే పాలేరు, సత్తుపల్లి, ఇల్లెందు, కొత్తగూడెం, ఖమ్మం నియోజకవర్గాల్లో ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొని బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని ప్రచారం చేయడంతో పార్టీ శ్రేణుల్లో మరింత జోష్ పెరిగింది. రెట్టించిన ఉత్సాహంతో గ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీ మ్యానిఫెస్టోను గడపగడపకూ పంచుతూ.. అందులోని హామీ అంశాలపై అవగాహన కల్పిస్తున్నారు. నిరంతర అభివృద్ధి కొనసాగాలంటే.. ప్రభుత్వ పథకాలు మరింత రెట్టింపు కావాలంటే బీఆర్ఎస్ ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందని చెబుతున్నారు. కేసీఆర్‌ను మూడోసారి ముఖ్యమంత్రిని చేయాల్సిన బాధ్యత ఓటరుగా మీ చేతుల్లోనే ఉందని వివరిస్తూ చేతులు జోడించి ఓట్లు అభ్యర్థిస్తున్నారు.
బోనకల్లు, నవంబర్ 8: బీఆర్ఎస్ అభ్యర్థి లింగాల కమల్‌రాజు గెలుపు కోరుతూ ముష్టికుంట్ల, జానకీపురం, గార్లపాడు, చొప్పకట్లపాలెం, బోనకల్లు, నారాయణపురం గ్రామాల్లో బుధవారం ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. కారు గుర్తుపై ఓటు వేయాలని అభ్యర్థిస్తూ సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను వివరిస్తూ లింగాల కమల్‌రాజును గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు బంధం శ్రీనివాసరావు, చేబ్రోలు మల్లికార్జునరావు, వేమూరి ప్రసాద్, బానోత్ కొండ, గ్రామ అధ్యక్ష, కార్యదర్శులు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
ఎర్రుపాలెం, నవంబర్ 8: మధిర బీఆర్ఎస్ అభ్యర్థి లింగాల కమల్‌రాజు గెలుపు కోసం ఆయన కుమార్తె అభిజ్ఞ బుధవారం ఎర్రుపాలెం ఎస్సీకాలనీలో నాయకులతో కలిసి విస్తృత ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరిగి కారు గుర్తుపై ఓటు వేసి తన తండ్రిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. కార్యక్రమంలో నాయకులు చావా రామకృష్ణ, పంబి సాంబశివరావు, దేవరకొండ శిరీష, శీలం కవిత, మొగిలి అప్పారావు, మస్తాన్‌వలీ, రామకోటయ్య, బాలరాఘవరెడ్డి, కొండేపాటి సాంబశివరావు, పుల్లారెడ్డి, కిశోర్‌బాబు, రవి, పద్మ, వెంకటేశ్వర్లు, భూషణం, సరోజిని, హుస్సేన్, భాస్కర్, సుదీర్, ప్రవీణ్, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. చింతకాని, నవంబర్ 8 : బీఆర్ఎస్ అభ్యర్థి లింగాల కమల్‌రాజ్ గెలుపు కోరుతూ బుధవారం మండలంలో నాయకులు, కార్యకర్తలు విస్తృత ప్రచారం నిర్వహించారు. అభివృద్ది, సంక్షేమ పథకాలను వివరిస్తూ ఇంటింటి ప్రచారం చేపట్టారు. ఈ సారి చింతకాని మండలం నుంచి లింగాల కమల్‌రాజ్‌కు గతం కంటే భారీ మెజార్టీ అందించాలని ఓటర్లను అభ్యర్థించారు. కార్యక్రమాల్లో బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, బూత్ కన్వీనర్లు, కమిటీ సభ్యులు, ముఖ్య కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.