ఖమ్మం, అక్టోబర్ 18: బీఆర్ఎస్ మ్యానిఫెస్టోకు అన్ని వర్గాల ప్రజలూ బ్రహ్మరథం పడుతున్నారని ఖమ్మం ఎంపీ, వైరా నియోజకవర్గ ఇన్చార్జి నామ నాగేశ్వరరావు పేరొన్నారు. వైరాలో బీఆర్ఎస్ అభ్యర్థి మదన్‌లాల్ గెలుపే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ చెబుతున్న గ్యారెంటీ హామీలన్నీ వారంటీ లేనివేనని, వారి మాయమాటలను ప్రజలకు వివరించాలని సూచించారు. బీఆర్ఎస్ సింగరేణి (కారేపల్లి) మండలం బీఆర్ఎస్ నాయకులు, సమన్వయ కమిటీ సభ్యులతో ఖమ్మంలోని తన నివాసంలో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎంపీ నామా మాట్లాడారు. ఎంతో దూరదృష్టితో ఆలోచించిన సీఎం కేసీఆర్.. మ్యానిఫెస్టోను అత్యద్భుతంగా రూపొందించారని అన్నారు. దీనిని ఇంటింటికీ తీసుకెళ్లి ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. బీఆర్ఎస్ విజయానికి బాటలు వేయాలని కోరారు. వైరా నియోజకవర్గంలో మదన్‌లాల్ గెలుపు ఎప్పుడో ఖాయమైందని స్పష్టం చేశారు. మంచి మెజార్టీ కోసం రేయింబవళ్లూ శ్రమించాలని సూచించారు. ఎన్నికల రూట్ మ్యాప్‌తో ప్రచారాన్ని మరింత ముమ్మరం చేయాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను గడపగడపకూ తీసుకెళ్లాలని కోరారు. ఎన్నికలప్పుడే కన్పించి మాయమాటలు చెప్పే వారి పట్ల ప్రజలను అప్రమత్తం చేయాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్సీ తాతా మధు, బీఆర్ఎస్ వైరా నియోజకవర్గ అభ్యర్థి మదన్‌లాల్, రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ నల్లమల వెంకటేశ్వరరావు, సింగరేణి ఎంపీపీ శకుంతల, చీమలపాడు సర్పంచ్ కిశోర్ పాల్గొన్నారు.