– ప్రభుత్వ వ్యతిరేఖతే ప్రధాన ఆయుధం
– ప్రతి వార్డులో బీఆర్ఎస్ జన ప్రభంజనం
– బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధు, పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి
ఖమ్మం రూరల్, జనవరి 31 : ఏదులాపురం మున్సిపాలిటీ ఎన్నికల్లో బీఆర్ఎస్- సిపిఎం కూటమి అభ్యర్థులు ఘన విజయం సాధించడం ఖాయమని బీఆర్ఎస్ పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధు, పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి అన్నారు. శనివారం ఏదులాపురం మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించిన సిపిఎం, బీఆర్ఎస్ పార్టీల సమీక్ష సమావేశం 22వ డివిజన్లో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు బెల్లం వేణుగోపాల్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి తాతా మధు, కందాలతో పాటు సిపిఎం నేతలు బండి రమేష్, నండ్ర ప్రసాద్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పేందుకు ఓటర్లు సిద్ధంగా ఉన్నారన్నారు. మున్సిపాలిటీ ప్రతి వార్డులో బీఆర్ఎస్ పార్టీకి బ్రహ్మరథం పట్టేందుకు ఓటర్లు వేచి చూస్తున్నారన్నారు. ఇప్పటికే అనేక సర్వేల్లో అధికార పార్టీ ప్రజా వ్యతిరేకత బయటపడిందన్నారు. ఈ ఎన్నికల్లో ప్రభుత్వ పాలన వ్యతిరేకత ప్రధాన ఆయుధంగా మారబోతుందని తెలిపారు.

Khammam Rural : ‘ఏదులాపురం మున్సిపోల్ లో బీఆర్ఎస్ కూటమి విజయం ఖాయం’
చేపట్టిన అనేక అభివృద్ధి పథకాలు, పేద ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలను మున్సిపాలిటీ ప్రజలు ఎప్పటికీ మరువబోరని అన్నారు. నాటి పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డి, అప్పటి సీఎం కేసీఆర్ ఈ ప్రాంతానికి జేఎన్టీయూ కళాశాలతో పాటు నర్సింగ్ కళాశాల, మద్దులపల్లి వ్యవసాయ మార్కెట్ ను మంజూరు చేయడంతో పాటు నిధులను సైతం విడుదల చేసిన సంగతి తెలిసిందే అన్నారు. అయితే ఆ పనులను సైతం తాను చేసినట్టు ఇక్కడి ప్రాంత ఎమ్మెల్యే, మంత్రి గొప్పలు చెప్పుకుని కొబ్బరికాయలు కొట్టడం సిగ్గుచేటు అన్నారు. ఇటీవల ఏర్పడిన ఏదులాపురం మున్సిపాలిటీకి కనీసం ఒక చెత్త సేకరణ బండిని సైతం ఏర్పాటు చేయలేదని, అదనంగా ఒక్క పారిశుధ్య కార్మికుడిని సైతం నియమించలేని నాయకులు రాబోయే రోజుల్లో ఆదర్శ మున్సిపాలిటీ చేస్తామని చెప్పడం సిగ్గుచేటని మండిపడ్డారు.

Khammam Rural : ‘ఏదులాపురం మున్సిపోల్ లో బీఆర్ఎస్ కూటమి విజయం ఖాయం’
కాబోతోంది.. రాబోతుంది అనే పదాలు తప్పా రెండున్నర ఏళ్లలో ఈ ప్రాంత అభివృద్ధికి చేసిందేమి లేదని దుయ్యబట్టారు. అమలు కానీ అబద్ధపు నాటి ఎన్నికల హామీలను ప్రజలు ఇప్పటికీ గుర్తు చేసుకుంటున్నారని, వచ్చే పది రోజులు నాయకులు అప్రమత్తంగా ఉండి ఓటర్లకు ఈ విషయాలను చేరవేయాలన్నారు. బీఆర్ఎస్, సీపీఎం శ్రేణులు ఐక్యత, సమన్వయంతో పనిచేసి అద్భుత ఫలితాన్ని సాధించి సీఎం కేసీఆర్ కు కానుకగా ఇవ్వాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైరా మాజీ ఎమ్మెల్యే బానోతు చంద్రావతి, బీఆర్ఎస్ నేత జీవన్ కుమార్, సిపిఎం నాయకులు ప్రసాద్, ఎర్ర శ్రీనివాసరావు పాల్గొన్నారు.