Khammam Bonalu | ఖమ్మం రూరల్ : శ్రావణమాసం రెండవ ఆదివారం పురస్కరించుకొని ఏదులాపురం మున్సిపాలిటీ, ఖమ్మం రూరల్ మండలంలో పల్లెలు ఒక్కసారిగా సందడిగా మారాయి. అనేక గ్రామాలలో లంబాడ గిరిజనులు ఉండటంతో ఇటు ముత్యాలమ్మ పండుగ వేడుకలు, అదే సమయంలో తీజ్ వేడుకలు జరగడంతో సాయంత్రం వేళ పల్లె వాతావరణం కలర్ ఫుల్ గా కనిపించింది.
ఎదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని పెద్దతండా సెంటర్లో జరిగిన తేజ్ వేడుకలకు వైరా నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బి చంద్రావతి హాజరయ్యారు. గిరిజన మహిళలతో కలిసి గిరిజన సాంప్రదాయ ప్రకారం గిరిజనుల ఆరాధ్య దైవానికి ప్రత్యేక పూజలు చేశారు. సాయంత్రం వేళల్లోనే ముత్యాలమ్మ తల్లికి బోనాలు సమర్పించే సమయం కావడంతో రెండు పండగల డప్పు వాయిద్యాలు, డీజే పాటలు ఆడపడుచుల నృత్యాలతో పల్లెల్లో జానపద సందడి నెలకొంది.
ఇంట్లో ప్రత్యేకంగా తయారు చేసిన నైవేద్యాలను తీసుకువచ్చిన మహిళలు అమ్మవార్లకు సమర్పించారు. అనంతరం తేటపోతులు కోళ్లు అమ్మవారికి బలి ఇచ్చి తమ మొక్కులను తీర్చుకున్నారు. ఏదులాపురం మున్సిపల్ చైర్పర్సన్ పి అనిత, మున్సిపల్ కమిషనర్ ఆళ్ల శ్రీనివాస్ రెడ్డితోపాటు ఆ అవార్డు కౌన్సిలర్లు, వివిధ పార్టీల ముఖ్య నాయకులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఈ వేడుకల్లో పాల్గొన్నారు.
