వర్షాలు సమృద్ధిగా కురవాలని, పాడి పంటలు పుష్కలంగా సమకూరాలని ఆయా గ్రామాల ప్రజలు వేడుకున్నారు. బోనాల పండుగ సందర్భంగా ఉమ్మడి వ్యాప్తంగా ఆయా గ్రామాల ప్రజలు ఆదివారం అమ్మవార్లకు బోనాలు, నైవేద్యాలు సమర్పించారు. తమ పాడి సంపదపైనా, పిల్లాపాపలపైనా అమ్మవార్ల ఆశీస్సులు ఉండాలని, సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో జీవించేలా దీవించాలని మొక్కుకున్నారు.
మహిళలందరూ సంప్రదాయం ప్రకారం ఉదయాన్నే ప్రత్యేక బోనాలు తయారు చేసుకున్నారు. వాటిని తలపై పెట్టుకొని ప్రతి ఇంటి నుంచీ బయలు దేరారు. గ్రామాల్లోని గంగమ్మ, ముత్యాలమ్మ అమ్మవార్ల ఆలయాలకు చేరుకొని ఆనవాయితీ ప్రకారం నైవేద్యాలు సమర్పించారు. ఆటాపాటలు, డప్పుచప్పులతో వెళ్లి అమ్మవార్ల దీవెనలు అందుకున్నారు.
-నమస్తే తెలంగాణ నెట్వర్క్, జూలై 28