‘భట్టి విక్రమార్క రాజీనామా చేయాలి.. సీపీని వెంటనే బదిలీ చేయాలి’
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పాతర్లపాడు మాజీ సర్పంచ్, కామ్రేడ్ సామినేని రామారావు హత్య కేసులో అసలైన నిందితులను గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ సీపీఎం సింగరేణి మండల కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం మండల కేంద్రంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా...
– సామినేని రామారావు హత్య కేసు పక్కదారి?
– నిరసిస్తూ సీపీఎం ఆధ్వర్యంలో సింగరేణిలో డిప్యూటీ సీఎం, సీపీ దిష్టిబొమ్మ దహనం
కారేపల్లి, అక్టోబర్ 30 : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పాతర్లపాడు మాజీ సర్పంచ్, కామ్రేడ్ సామినేని రామారావు హత్య కేసులో అసలైన నిందితులను గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ సీపీఎం సింగరేణి మండల కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం మండల కేంద్రంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, ఖమ్మం పోలీస్ కమిషనర్ దిష్టిబొమ్మలను దహనం చేశారు. సీపీఎం సింగరేణి మండల కార్యదర్శి కే.నరేంద్ర అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు కొండబోయిన నాగేశ్వరరావు మాట్లాడుతూ.. సామినేని రామారావు హత్య కేసులో వాస్తవాలను వెలుగులోకి తీసుకురావడంలో పోలీసు యంత్రాంగం విఫలమైందని ఆరోపించారు. హత్య కేసుతో సంబంధం లేని వ్యక్తులను అరెస్టు చేస్తూ అసలైన నిందితులను తప్పించే ప్రయత్నం జరుగుతోందని విమర్శించారు. కేసు దర్యాప్తును పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపిస్తూ ఖమ్మం పోలీస్ కమిషనర్‌ను వెంటనే బదిలీ చేయాలని, ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)తో సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
హత్య జరిగి దాదాపు సంవత్సరం కావస్తున్నా కేసులో ఆశించిన పురోగతి లేదని, అనుమానాలకు తావిచ్చే విధంగా పోలీసుల వ్యవహారశైలి ఉందని ఆయన మండిపడ్డారు. అధికారంలో ఉన్నవారి ఒత్తిళ్లకు తలొగ్గి చట్టాన్ని దుర్వినియోగం చేయడం ప్రజాస్వామ్య పాలనకు విరుద్ధమన్నారు. పోలీసు వ్యవస్థ రాజ్యాంగబద్ధంగా, నిష్పక్షపాతంగా పని చేయాలని హితవు పలికారు. ఈ కేసు విషయంలో నైతిక బాధ్యత వహిస్తూ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క రాజీనామా చేయాలని, పోలీస్ కమిషనర్‌ను తక్షణమే బదిలీ చేసి అసలైన నిందితులను గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో సీపీఎం ఆధ్వర్యంలో ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని, కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని ప్రజాక్షేత్రంలో ఎండగడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం సీనియర్ నాయకుడు ముక్క సీతారాములు, పార్టీ కార్యదర్శివర్గ సభ్యుడు రేకల మంగయ్య, మండల కమిటీ సభ్యులు ముండ్ల ఏకాంబరం, శ్రీరాములు, తిరపయ్య, సైదులు, కోటయ్య, సంపత్, మంద శ్రీను, తగర బాబు పాల్గొన్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘భట్టి విక్రమార్క రాజీనామా చేయాలి.. సీపీని వెంటనే బదిలీ చేయాలి’
Watch: మద్యం మత్తులో వాహనం నడిపిన మహిళా కానిస్టేబుల్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
PM Modi | దేశం కష్టాల్లో ఉంటే విపక్షాలకు సంతోషం.. ప్రధాని మోదీ తీవ్ర ఆరోపణలు..!
BRS Protest | భూత్పూర్ మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలని బీఆర్ఎస్ ధర్నా
ఎక్కువ మంది కూలీలకు ఉపాధి కల్పించాలి : అదనపు కలెక్టర్ విద్యా చందన
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

