రామవరం, ఫిబ్రవరి 16 : జిల్లా సైక్లింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం సైక్లింగ్ పోటీలను నిర్వహించారు. కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ ఈ పోటీలను ప్రారంభించారు. బైపాస్ రోడ్ వద్ద జరిగిన ఈ పోటీల్లో రెండు కిలోమీటర్లు సైక్లింగ్‌లో పదేళ్ల విభాగంలో రుద్రంపూర్ సెయింట్ జోసెఫ్ ఉన్నత పాఠశాల 4వ తరగతి విద్యార్థి మంద భవిత్ మెడల్ సాధించాడు.
ఈ పోటీలను విద్యానగర్‌కాలనీ నుంచి బైపాస్ రోడ్ వరకు రెండు కిలోమీటర్ల దూరాన్ని నిర్దేశించారు. లక్ష్యాన్ని సునాయాసంగా భవిత్ చేరుకొని మొదటి బహుమతిని అందుకున్నాడు. విజేతకు ప్రశంసతోపాటు మెడల్‌ను అందజేశారు.