భద్రాచలం, ఏప్రిల్ 8: శ్రీరామ నవమి, పట్టాభిషేకం మహోత్సవాలను తిలకించేందుకు వివిధ రాష్ర్టాల నుంచి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని రకాల సౌకర్యాలు కల్పించడానికి స్వచ్ఛంద సంస్థలు, అధికారులతో సహకరించాలని భద్రాచలం ఆర్డీఓ దామోదరరావు అన్నారు. సోమవారం సబ్ కలెక్టర్ కార్యాలయంలో తన చాంబర్లో జరిగిన సమావేశం ఆయన మాట్లాడారు.
ప్రస్తుతం ఎండలు విపరీతంగా ఉన్నందున ఆర్డబ్ల్యూఎస్, మిషన్ భగీరథ అధికారులు స్వచ్ఛమైన మంచినీటిని, మజ్జిగ ప్యాకెట్లను సరఫరా చేస్తున్నారని, స్వచ్ఛంద సంస్థలు అధికారులకు సహకరించాలన్నారు. మీ సంస్థల ద్వారా వలంటీర్లను నియమించాలన్నారు. వలంటీర్లు సెక్టార్లలోకి వెళ్లేందుకు గుర్తింపు కార్డులు ఇస్తామన్నారు. కార్యక్రమంలో జీఎం ఇండస్ట్రీస్ తిరుపతయ్య, మిషన్ భగీరథ డీఈ శ్రీనివాస్, హెచ్ఈవో దుర్గయ్య, జీపీ ఈవో శ్రీనివాస్, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు చారుగుళ్ల శ్రీనివాస్, విజయలక్ష్మి, దామోదరరావు, రాజారెడ్డి పాల్గొన్నారు.