Khammam Rural | సబ్బండ వర్గాలకు అండ గులాబీ జెండా : బెల్లం వేణుగోపాల్
సమాజంలోని శ్రామిక కార్మిక కర్షక సబ్బండ వర్గాలకు అండగా నిలబడే జెండా గులాబీ జెండా మాత్రమేనని బీఆర్ఎస్ పార్టీ ఖమ్మం రూరల్ అధ్యక్షుడు బెల్లం వేణుగోపాల్ అన్నారు.
ఖమ్మం రూరల్ : సమాజంలోని శ్రామిక కార్మిక కర్షక సబ్బండ వర్గాలకు అండగా నిలబడే జెండా గులాబీ జెండా మాత్రమేనని బీఆర్ఎస్ పార్టీ ఖమ్మం రూరల్ అధ్యక్షుడు బెల్లం వేణుగోపాల్ అన్నారు. పార్టీ 26వ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు ఖమ్మం రూరల్ మండలం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డులలో ఘనంగా జరిగాయి. ఈ వేడుకలలో వృద్ధులు, మహిళలు, యువకులు, విద్యార్థులు పార్టీ అనుబంధ సంఘాల నాయకులు పెద్ద ఎత్తున హాజరై గులాబీ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏదిలాపురం మున్సిపాలిటీ పరిధిలోని ఒకటి రెండు నాలుగు ఐదు ఆరు ఖమ్మం రూరల్ మండలంలోని పలు గ్రామాలలో జరిగిన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు ఆయన హాజరై గులాబీ జెండాలను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 14 ఏళ్ల సుదీర్ఘ స్వరాష్ట్ర పోరాటం పదేండ్ల బీ ఆర్ఎస్ ప్రభుత్వ పాలన రెండున్నర ఏండ్ల ప్రతిపక్ష పోరాట ఫలితం బీఆర్ఎస్ పార్టీ 26 ఆవిర్భావ వేడుకల మిశ్రమం అన్నారు స్వరాష్ట్ర సాధన తో పాటు సాధించుకున్న రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకుపోయిన గొప్ప నాయకుడు కేసీఆర్ అన్నారు. అధికారంలో ఉన్న లేకపోయినా ప్రజా సమస్యల పరిష్కారమే పార్టీ ప్రధాన ఎజెండా అన్నారు. ఆరు నూరైనా నూరు ఆరైనా మరోసారి కేసీఆర్ సీఎం కావడం ఖాయం అన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు నిత్యం ప్రజలతో మమేకమవుతూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం విధానాలను ఎండగట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hanumakonda | అసమాన ప్రతిభతో ‘ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్’లో చోటు.. చిన్నారిని అభినందించిన స్కూల్ యాజమాన్యం..!
IND vs WI | చితక్కొట్టిన శాంసన్, తిలక్, అయ్యర్.. రాంచీలో విండీస్ ముందు కొండంత లక్ష్యం..!
Pregnancy | గర్భం కోసం ప్రయత్నిస్తున్న మహిళలు.. ఎప్పుడు ఫెర్టిలిటీ నిపుణులని కలవాలి..?
Students Appeal | ‘మాబడిలో హిందీ టీచర్ లేరు.. కలెక్టర్‌కు చెప్పి మూడు నెలలైనా నియమించలే’..!
Newlywed Couple’s Bodies | కాళ్లకు గొలుసులతో.. నదిలో నూతన దంపతుల మృతదేహాలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

