వైరాటౌన్, మే 1 : అకాల వర్షంతో తడిచిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని వైరా మాజీ ఎమ్మెల్యే బానోతు మదన్‌లాల్ డిమాండ్ చేశారు. సిరిపురం నుంచి దాచాపురం వరకు సుమారు 16 కిలోమీటర్ల మేర రోడ్డుపై ఆరబెట్టిన ధాన్యాన్ని గురువారం ఆయన పరిశీలించారు. అకాల వర్షంతో ధాన్యాన్ని కాపాడుకునేందుకు నానా పాట్లు పడుతున్నామని, ఆ ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేసేలా చూడాలని రైతులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు.
దీంతో మదన్‌లాల్.. కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్‌కు ఫోన్ చేసి రైతుల ఇబ్బందులు, తడిచిన ధాన్యం గురించి వివరించారు. తడిచిన ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేసి రైతులకు న్యాయం చేయాలని మదన్‌లాల్ కోరారు. ఆయన వెంట పార్టీ మండల అధ్యక్షుడు బాణాల వెంకటేశ్వరరావు, మాజీ ఎంపీపీ కట్టా కృష్ణార్జున్‌రావు, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ ముళ్లపాటి సీతారాములు, బీఆర్ఎస్ నాయకులు కామినేని శ్రీనివాసరావు, లాల్‌మహ్మద్, కారుకొండ బోస్, తన్నీరు కిషోర్, అయినాల కనకరత్నం, వాసిరెడ్డి రవి ఉన్నారు.