కారేపల్లి, ఏప్రిల్ 11: తెలంగాణ రాష్ర్టాభివృద్ధిలో బీఆర్ఎస్ కీలక పాత్ర పోషించిందని, పదేళ్ల పాలనలో కేసీఆర్ రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో తీర్చిదిద్దారని మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ వైరా నియోజకవర్గ ఇన్చార్జి బానోతు మదన్‌లాల్ గుర్తుచేశారు. ఈ నెల 27న హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో నిర్వహించనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభ జయప్రదం కోసం కారేపల్లిలో శుక్రవారం ఏర్పాటుచేసిన సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. 25 ఏళ్ల పార్టీ ఆవిర్భావ వేడుకలను వాడవాడలా పండుగలా నిర్వహించాలని పిలుపునిచ్చారు.
సభకు వెళ్లే ముందు 27న ఉదయం అన్ని గ్రామాల్లో పార్టీ జెండాలను ఆవిషరించాలని కోరారు. అనంతరం సభ పోస్టర్లను ఆవిష్కరించారు. బీఆర్ఎస్ నాయకులు వాంకుడోతు జగన్, వీరేందర్, రమేశ్, గౌసుద్దీన్, జడల వెంకటేశ్వర్లు, వసంత, సోమందుల నాగరాజు, ఇస్లావత్ బన్సీలాల్, పేర్ని వెంకటేశ్వర్లు, దొంకెన రవి మణికొండ నాగేశ్వరరావు, జాటోత్ వీరియానాయక్ పాల్గొన్నారు.