వైరాటౌన్, ఏప్రిల్ 23 : బీఆర్ఎస్ రజతోత్సవ సభకు కదనరంగంలా కదిలిరావాలని వైరా మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇన్చార్జి బానోత్ మదన్‌లాల్ పిలుపునిచ్చారు. వైరాలోని బీఆర్ఎస్ కార్యాలయంలో బుధవారం జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. వైరా నియోజకవర్గంలో ఈ నెల 27న ఉదయం పార్టీ జెండాలు ఎగురవేసి ఎల్కతుర్తి బహిరంగ సభకు తరలిరావాలని కోరారు.
రాష్ట్రంలో ఏడాదిన్నర కాంగ్రెస్ పాలనలో ప్రజలు అన్ని రకాలుగా విసిగిపోయారని, ప్రజలు మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని అన్నారు. సమావేశంలో పార్టీ మండల, పట్టణ అధ్యక్షులు బాణాల వెంకటేశ్వరరావు, మద్దెల రవి, దిశా కమిటీ సభ్యులు కట్టా కృష్ణార్జున్‌రావు, సీనియర్ నాయకులు మాదినేని ప్రసాద్, పారుపల్లి నాగం, కామినేని శ్రీనివాసరావు, అయినాల కనకరత్నం, గుజ్జర్లపూడి దేవరాజు, షేక్ సైదా, తోటకూర వీరబాబు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
మధిర, ఏప్రిల్ 23 : ఎల్కతుర్తిలో ఈ నెల 27న జరిగే రజతోత్సవ సభతో కాంగ్రెస్ గుండెల్లో గుబులు పుట్టాలని జడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమల్‌రాజు అన్నారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభ సన్నాహక సమావేశం మధిర మండలం రాయపట్నం, బోనకల్లు మండలం రావినూతల గ్రామంలో బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు, ఆరు గ్యారెంటీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందన్నారు.
రాబోయేది మళ్లీ కేసీఆర్ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. సమావేశంలో మధిర మార్కెట్ మాజీ చైర్మన్ చిత్తారు నాగేశ్వరరావు, బంధం శ్రీనివాసరావు, మాజీ జడ్పీటీసీ బానోత్ కొండ, బోనకల్లు మండల అధ్యక్షుడు చేబ్రోలు మల్లికార్జునరావు, వేమూరి ప్రసాద్, బెజవాడ మల్లికార్జునరావు, పారా ప్రసాద్, మోదుగుల నాగేశ్వరరావు, జెర్రిపోతుల రవీందర్, కొమ్మినేని ఉపేందర్, రైతు నాయకులు చావా వేణుబాబు, రాయపట్నం నాయకులు, మజీ సర్పంచ్ తిమోతి, గోపి, తదితరులు పాల్గొన్నారు.
మణుగూరు టౌన్, ఏప్రిల్ 23 : ఈ నెల 27న హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని కోరుతూ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు మణుగూరులోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నుంచి పూల మార్కెట్, బస్టాండ్, అంబేద్కర్ సెంటర్ మీదుగా బుధవారం ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ అగ్రభాగాన కార్యకర్తలు నృత్యాలు చేశారు.
సభకు భారీగా శ్రేణులు తరలిరావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పార్టీ మండల కన్వీనర్ కుర్రి నాగేశ్వరరావు, కో కన్వీనర్ కుంజా లక్ష్మణ్, సీనియర్ నాయకులు వట్టం రాంబాబు, తాళ్లపల్లి యాదగిరి గౌడ్, ఆవుల నరసింహారావు, జావీద్ బాషా, తురక రాంకోటి, మండల యువజన అధ్యక్షుడు బోశెట్టి రవిప్రసాద్, యువజన నాయకులు బానోత్ రమేశ్, సృజన్, మానుకోటి మహేశ్, ఆవుల శ్రీను, గాజుల కార్తీక్, ఓబీ నాయకులు మధు, మాదేవి అశోక్, వేమూరి రమేశ్, రాము, రమాదేవి, చంద్రకళ, స్వర్ణలత పాల్గొన్నారు.