బోనకల్లు, మే 1 : ఖమ్మం జిల్లా బోనకల్లు మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడా ప్రాంగణంలో బాల్ బ్యాడ్మింటన్ వేసవి శిక్షణ శిబిరాన్ని ఎంపీడీఓ రురావత్ రమాదేవి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వేసవి కాలంలో విద్యార్థులకు క్రీడా నైపుణ్యాన్ని పెంపొందించేందుకు ఈ శిక్షణ శిబిరం దోహద పడుతుందన్నారు. నెల రోజుల పాటు కొనసాగే ఈ శిబిరంలో విద్యార్థులు బాల్ బ్యాట్మెంటన్లో క్రీడా నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలన్నారు.
శిక్షణ శిబిరాన్ని జిల్లా డీవైఎస్ఓ సునీల్ రెడ్డి పర్యవేక్షించి శిక్షణ అనంతరం సర్టిఫికెట్లు ఇవ్వడం జరుగుతుందన్నారు. మొదటి రోజు కోచ్ అమరేసి లింగయ్య ఆధ్వర్యంలో శిక్షణ ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో సీనియర్ బాల్ బ్యాడ్మింటన్ క్రీడాకారులు సీహెచ్ జగదీశ్, కె.నాగేశ్వరరావు పాల్గొన్నారు.