జూలూరుపాడు, జూన్ 17 : జూలూరుపాడు సబ్ ఇన్స్పెక్టర్ గా జీనత్ కుమార్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు ఇక్కడ ఎస్ఐగా విధులు నిర్వర్తించిన బాదావత్ రవి కొత్తగూడెం పోలీస్ స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్గా బదిలీ కావడంతో, మహబూబాబాద్‌లో విధులు నిర్వర్తిస్తున్న జీనత్ కుమార్ బదిలీపై వచ్చి ఇక్కడ బాధ్యతలు చేపట్టారు. విధుల్లో చేరిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిని ఉపేక్షించేది లేదని, నేరాల నియంత్రణకు కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మండల ప్రజలు పోలీసులకు పూర్తి సహకారం అందించాలని, చట్ట పరిధిలో ఎలాంటి సమస్య ఉన్నా నిర్భయంగా నేరుగా పోలీస్ స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేయవచ్చన్నారు.