Tekulapally | టేకులపల్లి, డిసెంబర్ 10 : పంచాయతీలో ఎన్నికలు ప్రశాంత వాతవరణంలో ఎన్నికలు జరిగేలా చూడాలని, ఇందుకు అభ్యర్థులు సహాకరించాలని ఇల్లందు డీఎస్పీ చంద్రభాను, జిల్లా ఎన్నికల సహాయ అధికారి బైరు మల్లీశ్వరీ కోరారు. టేకులపల్లి మండలంలోని ముత్యాలంపాడు క్రాస్ రోడ్ సమీపంలోని రైతు వేదికలో బుధవారం మూడో విడత జరిగే ఎన్నికల్లో మండల వ్యాప్తంగా పోటి చేస్తున్న 112 మంది సర్పంచ్ అభ్యర్థులకు ఎన్నికలపై అధికారులు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ఎన్నికల సంఘం విధించిన నియమ, నిబంధనలను పోటీలో ఉన్న అభ్యర్థులు తప్పనిసరిగా పాటించాలన్నారు. ఎలాంటి అవంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంత ఎన్నికల నిర్వహణకు అభ్యర్థులు సహకరించాలని కోరారు. అభ్యర్థుల ఖర్చు, ఇతర సందేహాలను అధికారులు నివృత్తి చేశారు. సమావేశంలో ఎంపీడీవో గణేశ్ గాంధీ పాల్గొన్నారు.