దమ్మపేట, జూలై 03 : తెలంగాణ మోటార్ వర్కర్స్ యూనియన్ ఈరోజు ఎస్కే మస్తాన్ ఆధ్వర్యంలో ప్రపంచ టూ వీలర్ మెకానిక్ డే ను ఘనంగా జరుపుకుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సర్పంచ్, ఉప సర్పంచ్ పగడాల రాంబాబు, ఆంగోతు శ్రీను మాట్లాడుతూ.. కార్మికుల పక్షాన నిలబడుతూ వారి సాధక బాధలలో తాము కూడా తోడుంటామని చెప్పారు. ఈ కార్యక్రమంలో దమ్మపేట ఎస్ఐ రాజేష్ కుమార్, మాజీ సర్పంచ్ దారా యుగేందర్, యూనియన్ సభ్యులు లోకేష్, కడార్ల శ్రీనివాస చారి, రొక్కాల అనిల్ కుమార్, నందిగం పాండు, జానీ, బాజీ, నవీన్, భాను పాల్గొన్నారు.