రామవరం, జూలై 25 : కార్మికుల సంక్షేమం కోసం తనవంతు కృషి చేస్తానని సింగరేణి కొత్తగూడెం ఏరియా పీవీకే 5 ఇంక్లైన్ గని ఏజెంట్ రామ్ బరోస్ మహాతో తెలిపారు. సింగరేణి కొత్తగూడెం ఏరియా పీవీకే 5 ఇంక్లైన్ గనికి బదిలీపై వచ్చిన ఆయన శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఏఐటీయూసీ ప్రతినిధులు, గని మేనేజర్ శ్యాం ప్రసాద్ ఆధ్వర్యంలో మహాతో కు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పీవీకే పిట్ సెక్రటరీ ఎస్కే హ్యుమాయన్ మాట్లాడుతూ.. పీవీకే మైన్ కి ఎంతో చరిత్ర ఉందన్నారు. ఉత్పత్తిలో మైన్ ముందుండేలా కార్మికులు, అధికారులు కృషి చేయాలన్నారు. పీవీకే కార్మికులు పని విషయంలోనే కాకుండా సంక్షేమ కార్యక్రమల విషయంలోనూ ముందుంటారని తెలిపారు. గని భవిష్యత్ కోసం, ఉత్పత్తి విషయంలో ఏజెంట్‌కు ఏఐటీయూసీ తరపున పూర్తి సహాయ సహకారాలు ఉంటాయన్నారు.
గని ఏజెంట్ రామ్ బరోస్ మహాతో మాట్లాడుతూ.. తన 25 సంవత్సరాల సర్వీసులో 22 సంవత్సరాలు అండర్ గ్రౌండ్ అనుభవం ఉందని, అండర్ గ్రౌండ్ కార్మికుల కష్టాలు, ఇబ్బందులు తనకు తెలుసన్నారు. కార్మికుల సంక్షేమ కోసం తన వంతు కృషి చేయనున్నట్లు చెప్పారు. గతంలో పని చేసిన మైన్స్ లైఫ్ పెంచడంలో అనుభవం ఉన్న నేపథ్యంలో ఆ అనుభవాన్ని ఉపయోగించి పీవీకే మైన్ భవిష్యత్ కోసం పని చేయనున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో భవిష్యత్ కోసం, ఉత్పత్తి లక్ష్యo కోసం యూనియన్ సహాయ సహకారాలు ఉండాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో బ్రాంచ్ అసిస్టెంట్ సెక్రటరీ గట్టయ్య, సెంట్రల్ ఆర్గనైజేషన్ సెక్రటరీ గనిగళ్ల వీరస్వామి, బ్రాంచ్ ట్రెజరర్ సందబోయిన శ్రీనివాస్, పిట్ అసిస్టెంట్ సెక్రటరీ సాయి పవన్, పిట్ వైస్ ప్రెసిడెంట్ నాగేశ్వర్రావు, వర్క్‌మెన్ ఇన్స్పెక్టర్ ప్రసాద్, సందీప్, సతీశ్, శ్రీనాథ్, దీరజ్, దాసరి శ్రీను, సేఫ్టీ కమిటీ మెంబర్ నారాయణ, ఎలక్ట్రీషియన్ రమణ, భూక్యా రమేశ్ పాల్గొన్నారు.