ఇల్లెందు, సెప్టెంబర్ 05 : విద్యార్థులకు ఉన్నత చదువు విషయంలో ఇవ్వవలసిన ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వాలని, పెండింగ్ బకాయిలను చెల్లించాలని డిమాండ్ ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం ఇల్లెందులో మాజీ ఎమ్మెల్యే హరిప్రియ నాయక ఆధ్వర్యంలో విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించారు. విద్యార్థులు, బీఆర్ఎస్వీ, నాయకులు, బీఆర్ఎస్ నాయకులతో ఇల్లెందు జెకే సెంటర్ నుండి జగదాంబ సెంటర్ మీదుగా పాత బస్టాండ్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం నిర్వహించిన సభలో హరిప్రియ నాయక్ మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల విఫల పాలనలో విద్యార్థులకు జరుగుతున్న అన్యాయంపై పార్టీ సీనియర్ నాయకుడు దిండిగల రాజేందర్, మహబూబాబాద్ జిల్లా పరిషత్ మాజీ చైర్ పర్సన్ బిందుతో భారీ ర్యాలీ నిర్వహించినట్లు తెలిపారు. విద్యార్థులకు న్యాయం జరిగేంత వరకు పోరాడుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు హరిసింగ్ నాయక్, రంగనాథ్, సిలివేరి సత్యనారాయణ, దేవీలాల్, జెకె శీను, శీలం రమేష్, కటకం పద్మావతి, తోట లలిత శారద, ఘాజి, మహేందర్, ఉపేందర్, శివ, రాజశేఖర్, ఇమ్రాన్, పింకు, ధనలక్ష్మి, సరిత, సన్నా రాజేష్, శ్రీను, పాష, సతీష్, రవికాంత్ పాల్గొన్నారు.

విద్యార్థులకు న్యాయం జరిగేంత వరకు పోరాటం : మాజీ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్