VANAMA | ఎస్ఆర్టీ నగర్ బాధితులను ఆదుకుంటాం : టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు వనమా రాఘవేందర్రావు..

కొత్తగూడెం: జిల్లాలోని చుంచుపల్లి మండలం రుద్రంపూర్ పంచాయతీలో ఉన్న ఎస్ఆర్టీ ఏరియా బాధితులకు అండగా ఉంటామని, వారిని అక్కడి నుంచి తొలగించవద్దని టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు వనమా రాఘవేందర్రావు అన్నారు. మంగళవారం ఎస్ఆర్టీ ఏరియాలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా బాధితులతో ఆయన మాట్లాడారు. సింగరేణి అధికారులు ప్రత్యామ్నాయం చూపించకుండా వారిని తరలించవద్దని, సింగరేణి అధికారులు ఆలోచించాలని అన్నారు. ఫోన్లో ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు బాధితులతో మాట్లాడి వారికి అండగా ఉంటామని ధైర్యం చెప్పారు.
ఎవరూ ఆందోళన చెందవద్దని, మీ వెంట మేము ఉంటామని, అవసరమైతే సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌ల తో మాట్లాడి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బాదావత్ శాంతి, ఎంపీటీసీ ఆర్తీ మక్కడ్, సర్పంచ్ గుమ్మడి సాగర్, నాయకులు కాసుల వెంకట్, ఉర్దూఘర్ కమిటీ చైర్మన్ అన్వర్‌పాషా, టీబీజీకేఎస్ నాయకులు ఎండీ రజాక్, కాపు కృష్ణ, చుంచుపల్లి మండల అధ్యక్షుడు ఉమర్, అజీజ్‌ఖాన్, మురాద్భాయ్, డైరెక్టర్ నిమ్మల సాగర్, తమ్మిశెట్టి అశోక్, అచ్చా నాగరాజు, యూత్ అధ్యక్షుడు కన్ని, రాసపల్లి ప్రసాద్, యాకయ్య, చెరుకుపల్లి నాగరాజు, గోపు కుమారస్వామి, నటరాజ్, ఫయాజ్, చిరంజీవి, బన్నీ, నాగమణి, అశోక్, చిలుక రాజయ్య, సుధాకర్, నరసయ్య తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
రోహిణి కార్తెను తలపిస్తున్న ఎండలు
ED Charge Sheets | వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో ఈడీ 9 ఛార్జీషీట్లు దాఖలు
డీజే ట్రాలీలో పేలిన టపాసులు.. నలుగురికి గాయాలు
Rahul Gandhi | పోలీసుల దాడిలో వినికిడి శక్తి కోల్పోయిన విద్యార్థిని.. ఢిల్లీ పోలీసులపై రాహుల్ గాంధీ ఆగ్రహం
Puri Jagannadh | ‘జార్జ్ క్రిష్’ సెట్స్‌లో పూరి జగన్నాథ్ సందడి.. శ్రీను వైట్లకు అదిరిపోయే సర్ప్రైజ్!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

