– బీఆర్ఎస్ భద్రాచలం నియోజకవర్గ ఇన్చార్జి రావులపల్లి రాంప్రసాద్
భద్రాచలం, జూన్ 09 : రాష్ర్టంలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై ప్రజలు విసుగు చెందారని, భవిష్యత్ అంతా రాష్ర్టంలో గులాబీమయం
కానుందని, పార్టీని నిర్మాణ పరంగా ముందుకు తీసుకుపోయి భవిష్యత్‌కు బాటలు వేయాలని భద్రాచలం బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి రావులపల్లి రాంప్రసాద్ అన్నారు. భద్రాచలంలో మంగళవారం జరిగిన పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయడంలో విఫలమైందని, భద్రాచలంలో రెండవ విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో నిజమైన పేదలకు న్యాయం జరిగే వరకు బీఆర్ఎస్ పోరాడుతుందన్నారు. ప్రజా సమస్యలపై ప్రతి వార్డులో కమిటీ వేసి పోరాటానికి ముందుకు రావాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
ప్రజా సమస్యలను గుర్తించి ప్రతి వార్డులో పార్టీ కమిటీలను ఏర్పాటు చేసి, ప్రజల్లోకి వెళ్లి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని కార్యకర్తలకు సూచించారు. గ్రామస్థాయి నుండి పార్టీ నిర్మాణాన్ని పటిష్టం చేస్తూ ప్రజలతో మమేకమై పని చేయాలని, ప్రతి కార్యకర్త పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో నియోజకవర్గ నాయకుడు మానె రామకృష్ణ, సీనియల్ నాయకులు కోటగిరి ప్రభోడ్ కుమార్, తుమ్మలపల్లి ధనేశ్వరరావు, అకోజు సునీల్ కుమార్, కోల్లం జయ ప్రేమకుమార్, ఉతా రమేష్, రేపాక ఘార్ణచంద్రరావు, గోసుల శ్రీనివాస్, పార్టీ మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.