ఇల్లెందు, అక్టోబర్ 14 : ఇల్లెందు గ్రంథాలయానికి వాటర్ ప్యూరిఫైయర్‌ను కోల్లి ఫౌండేషన్ వ్యవస్థాపకులు కల్పనా చౌదరి వితరణగా అందజేశారు. శాఖా గ్రంధాలయం ఇల్లెందు నందు జిల్లా గ్రంథాలయ సంస్థల చైర్మన్ పసుపులేటి వీరబాబు సమక్షంలో ఆమె వాటర్ ప్యూరిఫైయర్‌ను మంగళవారం బహూకరించారు. ఈ కార్యక్రమంలో గ్రంథ నిర్వాహకురాలు ఆర్.రుక్మిణి, యూత్ సన్నీ, విద్యార్థినీ విద్యార్థులు, పాఠకులు పాల్గొన్నారు.