– ఎన్నికల సంఘం సెల్ డిప్యూటీ సీఈవో రాంప్రసాద్
బూర్గంపహాడ్, జూలై 04 : ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ప్రక్రియలో భాగంగా ఎలక్ట్రోరల్ లిట్రసీ క్లబ్ ఏర్పాటు చేసుకుని 18 ఏళ్లు దాటిన యువతకు కొత్తగా ఓటు నమోదు చేపట్టాలని ఎన్నికల సంఘం సెల్ డిప్యూటీ సీఈవో రాంప్రసాద్ అన్నారు. శనివారం బూర్గంపహాడ్ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ఎలక్టోరల్ లిట్రసీ క్లబ్‌ను ఏర్పాటు చేసి ఒక టీచర్‌ను ఎన్నుకుని కళాశాల తరఫున 18 ఏళ్లు దాటిన ప్రతి యువతీ, యువకులకు కొత్తగా ఓటు నమోదు చేయించాలని, ఈ ఎలక్టోరల్ లిట్రసీ క్లబ్‌కు ఎంఈఓ ఇన్చార్జిగా వ్యవహరిస్తారని తెలిపారు. కొత్తగా ఓటు నమోదుతో పాటు వారికి ఓటరు ఐడీ కార్డు ఇప్పించాలని సూచించారు. ఈ అవగాహన సదస్సులో తాసీల్దార్ కేఆర్కే ప్రసాద్, ఎంపీడీఓ జమలారెడ్డి, డీటీ సమ్మయ్య, ఎంఈఓ యదుసింహరాజు, కార్యదర్శి సంపత్ శ్రీనివాస్, కళాశాల యాజమాన్యం, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.