తాగునీటి కోసం గ్రామస్తుల అవస్థలు.. పట్టించుకోని సింగరేణి అధికారులు
సింగరేణి ప్రభావిత ప్రాంతాల ప్రజలకు స్వచ్ఛమైన తాగునీటిని అందించాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ప్యూరిఫైయర్ వాటర్ ప్లాంట్లు నిర్వహణ లోపంతో నిరుపయోగంగా మారుతున్నాయి. దీంతో గ్రామీణ ప్రజలు తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
– 15 రోజులుగా పనిచేయని ప్యూరిఫైయర్ వాటర్ ప్లాంట్
రుద్రంపూర్, నవంబర్ 16 : సింగరేణి ప్రభావిత ప్రాంతాల ప్రజలకు స్వచ్ఛమైన తాగునీటిని అందించాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ప్యూరిఫైయర్ వాటర్ ప్లాంట్లు నిర్వహణ లోపంతో నిరుపయోగంగా మారుతున్నాయి. దీంతో గ్రామీణ ప్రజలు తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీకే సీఎం ఓపెన్‌కాస్ట్ గనికి అత్యంత సమీపంలో ఉన్న ప్రభావిత ప్రాంతమైన రుద్రంపూర్‌లో ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్ గత 15 రోజులుగా పని చేయడం లేదు. ఈ ప్లాంట్ ద్వారా రుద్రంపూర్తో పాటు గౌతంపూర్, ధన్‌బాద్, లక్ష్మీపురం తండా గ్రామాల ప్రజలతో పాటు సింగరేణి కార్యాలయాలకు కూడా శుద్ధి చేసిన నీటిని సరఫరా చేస్తుంటారు. అయితే సాంకేతిక సమస్యలు తలెత్తడంతో ప్లాంట్ మూతపడింది. దీంతో ప్రజలు గత్యంతరం లేక బయట నుండి డబ్బులు వెచ్చించి తాగునీటిని కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్లాంట్‌ను వెంటనే మరమ్మతులు చేయించి అందుబాటులోకి తీసుకురావాలని రుద్రంపూర్ సర్పంచ్ బానోత్ కేస్లీ, ఉప సర్పంచ్ తోట రాజు, పాలకమండలి సభ్యులు ఇప్పటికే వీకే సీఎం కోల్ మైన్ ప్రాజెక్ట్ ఆఫీసర్‌కు వినతిపత్రాలు అందజేశారు. అయినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో గ్రామస్తులు అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
తాగునీటి కోసం గ్రామస్తుల అవస్థలు.. పట్టించుకోని సింగరేణి అధికారులు
‘అర్హులకు పెన్షన్లు మంజూరు చేయాలి’
జడ్పీహెచ్ఎస్ రుద్రంపూర్‌లో స్వయం పరిపాలన దినోత్సవం
Sachin Tendulkar: 49 ఏళ్ల తర్వాత కూడా.. చిన్ననాటి బ్యాట్ ఫోటోను పోస్టు చేసిన సచిన్
Health tips | మీరు షుగర్ పేషెంటా.. అయితే మీ గుండెను కాపాడుకోండిలా..!
ట్రెండింగ్ వార్తలు
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ

