Sachin Tendulkar: 49 ఏళ్ల తర్వాత కూడా.. చిన్ననాటి బ్యాట్ ఫోటోను పోస్టు చేసిన సచిన్
Sachin Tendulkar: సచిన్ చిన్నప్పుడు బ్యాట్ పట్టుకుని దిగిన ఫోటో గుర్తుందా. ఇప్పుడు ఆ ఫోటోకు మరో కొత్త ఫోటో జోడీ అయ్యింది. ఆ చిన్ననాటి బ్యాట్‌తో తాజాగా సచిన్ ఓ ఫోటో దిగాడు. 49 ఏళ్లుగా ఆ బ్యాట్ తనతోనే ఉన్నట్లు చెప్పాడు. ఇన్‌స్టాలో పిక్స్ పోస్టు చేశారు.
ముంబై: మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్(Sachin Tendulkar) తన తీపి జ్ఞాపకాలను పంచుకున్నారు. సచిన్ ఫోటో ఆల్బమ్‌లో చిన్నప్పుడు బ్యాట్‌తో దిగిన ఫోటో క్రికెట్ అభిమానులకు సుపరిచితమే. అయితే ఆ నాటి బ్యాట్‌తోనే మళ్లీ సేమ్ ఫోజులో ఫోటో దిగాడు సచిన్. 49 ఏళ్ల క్రితం ఆ బ్యాట్‌తో దిగిన ఫోటోతో పాటు కొత్త ఫోటోను ఇన్‌స్టాలో సచిన్ అప్లోడ్ చేశారు. పెహ్లీ బ్యాట్ కీ బాత్ హై, 49 సాల్ బాద్ బీ మేరా సాత్ హై అన్న ట్యాగ్‌లైన్‌తో రెండు ఫోటోలను సచిన్ తన అకౌంట్లో పోస్టు చేశారు. చిన్ననాటి జ్ఞాపకాలను సచిన్ ఇంకా మరువలేదన్న దానికి ఆ బ్యాట్ నిదర్శనంగా నిలుస్తున్నది. 49 ఏళ్లుగా ఆ బ్యాట్‌తో తనతో ఉన్నట్లు చెప్పారు. సచిన్ తన చిన్ననాటి స్మృతులను నెమరేసుకున్న తీరుపై అభిమానులు రియాక్ట్ అవుతున్నారు. మాస్టర్‌తో పాటు నమ్మకమైన అతని సహచరి అని ఓ అభిమాని రాశాడు. గాడ్ ఆఫ్ క్రికెట్ అని మరో వ్యక్తి ఆ పోస్టుపై రియాక్ట్ అయ్యారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sachin Tendulkar: 49 ఏళ్ల తర్వాత కూడా.. చిన్ననాటి బ్యాట్ ఫోటోను పోస్టు చేసిన సచిన్
Health tips | మీరు షుగర్ పేషెంటా.. అయితే మీ గుండెను కాపాడుకోండిలా..!
Ajay Kumar | జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్యను తక్షణమే పరిష్కరించాలి : పువ్వాడ అజయ్ కుమార్
పిట్టలదొరకు పుట్టెడు కష్టాలు
Teja Sajja | హైదరాబాద్‌లో ఘనంగా తేజ సజ్జా నిశ్చితార్థ వేడుక.. హాజరైన పలువురు ప్రముఖులు!
ట్రెండింగ్ వార్తలు
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ

