Health tips | మీరు షుగర్ పేషెంటా.. అయితే మీ గుండెను కాపాడుకోండిలా..!
Health tips | సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నవాళ్లతో పోల్చితే మధుమేహం (Diabetes) సమస్య ఉన్నవాళ్లు గుండె జబ్బుల బారినపడే ప్రమాదం ఎక్కువ. అందుకే షుగర్ పేషెంట్లు (Sugar Patients) గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో పెట్టుకోవాలి.
Health tips : సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నవాళ్లతో పోల్చితే మధుమేహం (Diabetes) సమస్య ఉన్నవాళ్లు గుండె జబ్బుల బారినపడే ప్రమాదం ఎక్కువ. అందుకే షుగర్ పేషెంట్లు (Sugar Patients) గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో పెట్టుకోవాలి. డయాబెటిస్ లేని వారితో పోల్చితే డయాబెటిస్ ఉన్న వారిలో గుండె జబ్బులు వచ్చే ప్రమాదం రెండింతలు ఎక్కువని పలు పరిశోధనలు కూడా తేల్చాయి. కాబట్టి గుండెను కాపాడుకోవాలంటే ముందుగా షుగర్ వ్యాధిని అదుపులో పెట్టడం చాలా ముఖ్యం. షుగర్‌ను అదుపు చేసే కొన్ని చిట్కాల (Tips) గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
1. ఆరోగ్యకరమైన డైట్
డయాబెటిస్ వ్యాధి ఉన్నవారు తాము తీసుకోవాల్సిన, తీసుకోగూడని ఆహారాలను గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఫ్రైడ్ ఫుడ్స్, షుగర్ స్థాయిలు అధికంగా ఉండే ఫుడ్ ఐటమ్స్, ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలను అస్సలు తీసుకోకపోవడం ఉత్తమం.
2. శారీరక వ్యాయామం
షుగర్ సమస్య ఉన్నవారు రోజుకు కనీసం 30 నిమిషాలకు తగ్గకుండా వ్యాయామం చేయడం అవసరం. యోగాసనాలు వేయడం, ఎక్సర్సైజ్లు చేయడం ద్వారా రక్తంలో షుగర్ స్థాయిలు అదుపులో ఉంటాయి.
3. నిపుణుల పర్యవేక్షణలో మెడికేషన్
షుగర్ మెడిసిన్ ఎలా పడితే అలా వాడకూడదు. ఎండోక్రైనాలజిస్ట్ లేదా డయాబెటాలజిస్ట్‌ను సంప్రదించి వారు రాసిన మెడికేషన్ మాత్రమే తీసుకోవాలి. అంతేగాక మెడిసిన్ వైద్యుడు చెప్పిన సమయానికి తీసుకోవాలి. సమయపాలన, రెగ్యులారిటీ లేకుండా ఔషధాలను వినియోగించడంవల్ల సరైన ఫలితం ఉండదు.
4. బరువును అదుపులో ఉంచడం
షుగర్ పేషెంట్లు కొందరు వెయిట్ లాస్ అయితే, మరి కొంతమంది వెయిట్ గెయిన్ అవుతుంటారు. ఇవి రెండూ ప్రమాదకరమే. కాబట్టి బరువును అదుపులో పెట్టుకోకపోతే గుండె జబ్బుల బారినపడే ప్రమాదం ఉన్నది.
5. కండ్లను కాపాడుకోవడం
డయాబెటిస్ అదుపు తప్పితే కంటి సమస్యలు వచ్చే ప్రమాదం కూడా ఉన్నది. కాబట్టి రెగ్యులర్‌గా కంటి పరీక్షలు చేయించుకోవాలి. లేదంటే కంటి లోపలి భాగాలు దెబ్బతిని చూపును కోల్పోయే ప్రమాదం ఉంది.
6. మూత్ర పరీక్షలు
షుగర్ పేషెంట్లు క్రమం తప్పకుండా మూత్ర పరీక్షలు చేయించుకోవాలి. దీనివల్ల ప్రొటీన్ లీకేజీ ఏమైనా ఉన్నదా, సీరమ్ క్రియాటినైన్ ఎంత ఉన్నది అనే వివరాలు తెలుస్తాయి. ఇలా తెలుసుకోవడం వల్ల భవిష్యత్తులో కిడ్నీ సమస్యలు రాకుండా జాగ్రత్త పడవచ్చు.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health tips | మీరు షుగర్ పేషెంటా.. అయితే మీ గుండెను కాపాడుకోండిలా..!
Ajay Kumar | జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్యను తక్షణమే పరిష్కరించాలి : పువ్వాడ అజయ్ కుమార్
పిట్టలదొరకు పుట్టెడు కష్టాలు
Teja Sajja | హైదరాబాద్‌లో ఘనంగా తేజ సజ్జా నిశ్చితార్థ వేడుక.. హాజరైన పలువురు ప్రముఖులు!
ఎంపీడబ్ల్యూ కార్మికులకు పీఎఫ్, ఈఎస్ఐ కోసం మంత్రి సీతక్కకు వినతి
ట్రెండింగ్ వార్తలు
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ

