‘అర్హులకు పెన్షన్లు మంజూరు చేయాలి’
చుంచుపల్లి మండల పరిధిలోని గౌతంపూర్ గ్రామ పంచాయతీలో ఆసరా పెన్షన్ల మంజూరులో అర్హులకు అన్యాయం జరుగుతోందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెన్షన్ల కోసం వంద మందికి పైగా దరఖాస్తులు సమర్పించగా, కేవలం 15 మందికి మాత్రమే మంజూరు చేయడంపై....
చుంచుపల్లి, నవంబర్ 16 : చుంచుపల్లి మండల పరిధిలోని గౌతంపూర్ గ్రామ పంచాయతీలో ఆసరా పెన్షన్ల మంజూరులో అర్హులకు అన్యాయం జరుగుతోందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెన్షన్ల కోసం వంద మందికి పైగా దరఖాస్తులు సమర్పించగా, కేవలం 15 మందికి మాత్రమే మంజూరు చేయడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ సోమవారం గౌతమ్పూర్ ఎంపీడీవోకు స్థానిక బిజెపి నాయకులు సొప్పరి క్రాంతి, పలువురు గౌతమ్పూర్ వాసులు వినతిపత్రం అందజేశారు. ముఖ్యంగా సదరం ధ్రువీకరణ పత్రాల్లో 80 నుండి 100 శాతం వైకల్యం ఉన్న దివ్యాంగులకు సైతం పెన్షన్లు మంజూరు కాకపోవడం బాధాకరమన్నారు. తీవ్ర వైకల్యంతో జీవనం సాగిస్తూ పెన్షన్లపై ఆధారపడాల్సిన వారికి కూడా ఆర్థిక భరోసా అందకపోవడం అన్యాయమని పేర్కొన్నారు. ప్రతి దరఖాస్తును పారదర్శకంగా పరిశీలించి, నిజమైన అర్హులను గుర్తించి పెన్షన్లు మంజూరు చేయాలని అధికారులను వారు కోరారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘అర్హులకు పెన్షన్లు మంజూరు చేయాలి’
జడ్పీహెచ్ఎస్ రుద్రంపూర్లో స్వయం పరిపాలన దినోత్సవం
Sachin Tendulkar: 49 ఏళ్ల తర్వాత కూడా.. చిన్ననాటి బ్యాట్ ఫోటోను పోస్టు చేసిన సచిన్
Health tips | మీరు షుగర్ పేషెంటా.. అయితే మీ గుండెను కాపాడుకోండిలా..!
Ajay Kumar | జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్యను తక్షణమే పరిష్కరించాలి : పువ్వాడ అజయ్ కుమార్
ట్రెండింగ్ వార్తలు
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ

