రామవరం, నవంబర్ 22 : కొత్తగూడెం ఏరియా స్టోర్స్ డిప్యూటీ ఎస్ఈగా వెంకటరమణ శనివారం బాధ్యతలు స్వీకరించారు. RG2 ఏరియా నుండి బదిలీపై వచ్చిన ఆయనను సింగరేణి బిసి& ఓబీసీ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ బ్రాంచ్ కార్యదర్శి సకినాల సమ్మయ్య ఆధ్వర్యంలో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం ఇచ్చి ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా బ్రాంచ్ కార్యదర్శి మాట్లాడుతూ.. సింగరేణిలో బిసి & ఓబీసీ ఉద్యోగుల శాతం అధికంగా ఉందన్నారు. కానీ వారికి ఆర్ఓఆర్ పద్ధతిలో అన్యాయం జరుగుతుందని తెలిపారు, అందరం కలిసికట్టుగా తమకు రావాల్సిన హక్కులను సాధించుకోవడానికి పోరాడుదాం అన్నారు.
అదేవిధంగా రాష్ట్రంలో జరిగే 42 శాతం బీసీల ఉద్యమంలో కూడా అందరం పాలుపంచుకుని బీసీల ఐక్యతను చాటాలన్నారు. 42 శాతం రిజర్వేషన్ సాధించుకోవడంలో సింగరేణి బిసి ఉద్యోగులు కూడా ముందుండి పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ బ్రాంచ్ కార్యదర్శి సందబోయిన శ్రీనివాస్, ఎస్.నాగేశ్వరరావు, రాజాలపూడి సాంబమూర్తి, కమల్, కూసన నరేందర్, వేముల నరేశ్, వినయ్, సుబ్రమణ్యం, పడాల కృష్ణ, అవినాష్, రాజేశ్, ఉదయ్ భాస్కర్ పాల్గొన్నారు,