ఖమ్మం : నాగరామకృష్ణ కుటుంబం ఆత్మహత్యకు కారకుడైన వనమా రాఘవేంద్రరావును ఏ వన్ గా నమోదు చేసి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా సత్వర న్యాయం జరిగేలా చూసి, కఠినంగా శిక్షించాలని, అతని వల్ల మరో కుటుంబం బలి కాకుండా చూడాలని తెలంగాణ బహుజన జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. వనమా రాఘవేంద్రరావు ఆగడాలకు,అరాచకాలకు అడ్డు,అదుపు లేకుండా పోయిందని, గతంలో కూడా చాలా ఫిర్యాదులు ఉన్నాయని, విచ్చలవిడిగా బెదిరింపులకు పాల్పడుతున్నారని, అనేక కుటుంబాలేకాకుండా, ఎంతో మంది యువతులు అతనివల్ల బలయ్యారని ఆరోపించారు.
ఈ సందర్భంగా తెలంగాణ బహుజన జేఎస్ గౌరవ సలహాదారు డాక్టర్ కెవి కృష్ణారావు, నాయకులు గుంతేటి వీరభద్రం,బానోత్ భద్రు నాయక్,వల్లెపు సోమరాజు,యాదగిరి,దాసరి శ్రీనివాస్,మందరాజు,వెంకన్న తదితరులు పాల్గొన్నారు.