విశ్వామిత్ర చౌహాన్‌కు వనజీవి రామయ్య స్మారక పురస్కారం
ప్రకృతికి విశేష సేవలందించిన పద్మశ్రీ వనజీవి రామయ్య జయంతి సందర్భంగా జూబ్లీహిల్స్‌లోని ప్రసాద్ ఫిల్మ్ ల్యాబ్స్‌లో నిర్వహించిన "వనజీవి రామయ్య అవార్డు మహోత్సవం"లో బాల పర్యావరణ ప్రేమికుడు, 'మొక్కల వారసుడు'గా పేరుగాంచిన విశ్వామిత్ర చౌహాన్‌కు...
కొత్తగూడెం, జూలై 02 : ప్రకృతికి విశేష సేవలందించిన పద్మశ్రీ వనజీవి రామయ్య జయంతి సందర్భంగా జూబ్లీహిల్స్‌లోని ప్రసాద్ ఫిల్మ్ ల్యాబ్స్‌లో నిర్వహించిన “వనజీవి రామయ్య అవార్డు మహోత్సవం”లో బాల పర్యావరణ ప్రేమికుడు, ‘మొక్కల వారసుడు’గా పేరుగాంచిన విశ్వామిత్ర చౌహాన్‌కు ప్రతిష్ఠాత్మక “వనజీవి రామయ్య స్మారక పురస్కారం” ప్రదానం చేశారు. ‘వనజీవి రామయ్య’ చిత్ర దర్శకుడు వేముగంటి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో 70 ఎకరాల అటవీని సృష్టించిన పర్యావరణవేత్త దుశ్చర్ల సత్యనారాయణ చేతుల మీదుగా విశ్వామిత్ర చౌహాన్‌కు పురస్కారం అందజేసి శాలువాతో ఘనంగా సత్కరించారు. పర్యావరణ పరిరక్షణలో చిన్నారి చేస్తున్న విశేష సేవలను ఈ సందర్భంగా నిర్వాహకులు అభినందించారు. ఈ అవార్డును భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన పర్యావరణవేత్తలు మొక్కల వెంకటయ్య, ‘సీడ్ మ్యాన్ ఆఫ్ ఇండియా’ హరినాథ్ కూడా అందుకున్నారు. అనంతరం వనజీవి రామయ్యకు నివాళిగా హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ హోటల్ ప్రాంగణంలో విశ్వామిత్ర చౌహాన్ “పింక్ పనస” మొక్కను నాటారు. ప్రకృతిని పరిరక్షించడమే వనజీవి రామయ్యకు నిజమైన నివాళి అని చౌహాన్ పేర్కొన్నాడు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bhaskar Rao | సింగరేణి లాభాల తగ్గుదలపై సమగ్ర నివేదిక విడుదల చేయాలి : మాజీ ఎమ్మెల్యే భాస్కర్ రావు
పంచాయతీ అధికారి పర్సంటేజీల దందా ?
Weight Loss Surgery | కౌమారదశలో ఉన్న వారికి బరువు తగ్గించే శస్త్ర చికిత్సలు అవసరమా.. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏం చెప్పింది..?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సుంకరి భిక్షంగౌడ్
Mekala Vishnu Vardhan | అర్హులంతా గ్రాడ్యుయేట్ ఓటు నమోదు చేసుకోవాలి : బీఆర్ఎస్ యూత్ వింగ్ అధ్యక్షుడు మేకల విష్ణువర్దన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

