చుంచుపల్లి, మే 08 : సింగరేణి కార్పొరేట్ ఏరియా వర్క్ పీపుల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఆధ్వర్యంలో సీఈఆర్ క్లబ్ ప్రాంగణంలో నిర్వహిస్తున్న బాస్కెట్ బాల్ ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని కోచ్‌లు జాన్సన్ డేవిడ్, జబ్బర్ అన్నారు. గురువారం వారు మాట్లాడుతూ.. సింగరేణి, పరిసర ప్రాంతాలకు చెందిన 18 ఏండ్లలోపు బాలబాలికలు సమ్మర్ క్యాంప్‌లో పాల్గొనాల్సిందిగా సూచించారు. వేసవి సెలవులను వృధా చేయకుండా మానసిక ఉల్లాసానికి ఉపయోగపడే ఈ క్యాంప్ ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రతి రోజు ఉదయం 6.00 నుండి 8 గంటల వరకు, అలాగే సాయంత్రం 5.30 నుండి 7.00 గంటల వరకు శిక్షణ నిర్వహించబడుతుందని తెలిపారు. క్రీడలతో మానసిక ఉల్లాసంతో పాటు శరీరం దృఢంగా తయారవుతుందన్నారు.
Chunchupalli : బాస్కెట్ బాల్ ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోండి : జాన్సన్ బాబు