గంజాయి సేవిస్తున్న ఇద్దరు యువకులు అరెస్ట్
చుంచుపల్లి మండల పరిధిలో గంజాయి సేవిస్తున్న ఇద్దరు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల వివరాల ప్రకారం.. శుక్రవారం సాయంత్రం విద్యానగర్ బైపాస్ రోడ్డులోని సుమన్ కార్యాలయం పక్కన ఉన్న ఖాళీ స్థలం వద్ద ఇద్దరు వ్యక్తులు...
చుంచుపల్లి, ఆగస్టు 29 : చుంచుపల్లి మండల పరిధిలో గంజాయి సేవిస్తున్న ఇద్దరు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల వివరాల ప్రకారం.. శుక్రవారం సాయంత్రం విద్యానగర్ బైపాస్ రోడ్డులోని సుమన్ కార్యాలయం పక్కన ఉన్న ఖాళీ స్థలం వద్ద ఇద్దరు వ్యక్తులు పోలీసులను చూసి పారిపోయేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు వారిని వెంబడించి పట్టుకుని పరీక్షలు నిర్వహించగా గంజాయి సేవించినట్లు నిర్ధారణ అయింది. విచారణలో తాము గంజాయి సేవిస్తున్నట్లు వారు అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. రామవరం ప్రాంతానికి చెందిన వీరిపై కేసు నమోదు చేసి శనివారం కోర్టులో హాజరు పరిచారు. మేజిస్ట్రేట్ ఆదేశాల మేరకు ఇద్దరిని భద్రాచలంలోని డీ-అడిక్షన్ సెంటర్‌కు తరలించినట్లు తెలిపారు. యువత గంజాయి వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని పోలీసులు సూచించారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Binod Chaudhary: నేపాలీ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన ఆ దేశ ఏకైక బిలియనీర్
వరల్డ్ బ్యాంక్ బృందం నల్లగొండ క్లాక్ టవర్ జంక్షన్ అభివృద్ధి పనుల పరిశీలన
Mamitha Baiju | అతడి నిర్ణయమే ఫైనల్.. పెళ్లి పుకార్లకు ఫుల్స్టాప్ పెట్టిన మమితా బైజు
Women | మహిళలు తప్పనిసరిగా చేయించుకోవాల్సిన వైద్య పరీక్షలు ఇవే.. నిపుణుల సూచన..
Rashmi | ఐదేళ్ల చిన్నారి హత్యపై యాంకర్ రష్మి ఆవేదన.. మనం ఎటు వెళ్తున్నాం అంటూ భావోద్వేగ పోస్ట్!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

