పాల్వంచ : కొత్తగూడెం జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో పాల్వంచలోని ఆ సంఘం కార్యాలయంలో శ్రీకాంతాచారీ వర్ధంతిని శుక్రవారం నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు కాపర్తి వెంకటాచారీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జయశంకర్ సార్ ఎలాగైతే పోరాటం చేశారో అలానే ఎల్బీనగర్ చౌరస్తాలో శ్రీకాంతాచారీ బలిదానం చేసుకున్నారని అన్నారు. తెలంగాణ కోసం పోరాటం చేసిన వారి కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో మోత్కూరి రవి, జుజ్జూరి ప్రభాకరాచారీ, అక్కినేపల్లి వెంకటేశ్వర్లు, తిరుమల, కటుకోజ్వల సత్యనారాయణ, గన్నవరపు ప్రతాప్, పి.శ్రీను, బాలు, మామిళ్లపల్లి వెంకటేశ్వర్లు, లక్ష్మీనారాయణ, ఆముదాల రమేష్, ప్రతాప్, ధనుమూరి వీరాచారీ, రాజు పాల్గొన్నారు.
స్థూపం వద్ద శ్రీకాంతాచారీ వర్ధంతి..
తెలంగాణ విశ్వబ్రాహ్మణ సంఘం పట్టణ కమిటీ అధ్యక్షుడు తాళ్లూరి సత్యనారాయణ ఆధ్వర్యంలో పాల్వంచలోని అమరవీరుల స్థూపం వద్ద శ్రీకాంతాచారీ వర్ధంతిని నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో దిగూట్ల వెంకటాచారీ, సంగోజు శ్రీనివాస్, సున్నం రాము, అప్పలాచారీ, శ్రీపాద సత్యనారాయణ, గుగ్గిళ్ల రత్నాచారీ, ఏడుకొండలు, కృష్ణమాచారీ, రవిగౌడ్, శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.