Koya Wedding Card | మాతృభాషపై ఎవరికైనా ప్రేమ ఉండటం సహజమే. అయితే తమ మాతృభాషపై ఉన్న ప్రేమను సరికొత్తగా చాటి వార్తల్లో నిలిచింది ఓ జంట. పెండ్లి శుభలేఖలు సాధారణంగా ఎక్కువగా తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషల్లో చూస్తుంటాం. కానీ ఇదివరకెన్నడూ చూడని విధంగా కోయ భాషలో రెడీ చేసిన వెడ్డింగ్ కార్డ్ ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతోంది.
పెండ్లి పత్రికపై కుటుంబసభ్యుల పేర్లు, వివాహ వేదిక, తేదీ, వివాహ సమయం తెలుగులో అచ్చు వేయించడం మినహా మిగిలివన్నీ కోయ భాషలో రాయించి వార్తల్లో నిలిచారు ఆదివాసీలు ఉండం బాలరాజు-అనిత.
కోయ భాషలో పిలుచుకునే పదాలతో శుభలేఖ వేంయించుకున్న ఆదివాసీ దంపతుల (శ్రీనివాస్-వినిత) వెడ్డింగ్ కార్డ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆదివాసీలకు తమ మాతృ భాషపై ఉన్న మమకారాన్ని ఈ వెడ్డింగ్ కార్డ్ చెప్పకనే చెబుతోంది.
Srisailam | శ్రీశైలంలో భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన డీఐజీ ప్రవీణ్
బస్సులున్నయ్.. డ్రైవర్లే లేరు !.. డిప్యూటీ సీఎం ఇలాకాలో ఆర్టీసీ డ్రైవర్ల కొరత!