రామవరం, సెప్టెంబర్ 04 : మనలోని అజ్ఞాన పొరలు తొలగించి, జ్ఞానదీప్తిని వెలిగించేవాడు గురువు అని ప్రిన్సిపాల్ బ్రదర్ రాజశేఖర్ రెడ్డి అన్నారు. గురువారం రామవరం మండలంలోని ధన్బాద్ పంచాయతిలో గల సెయింట్ జోసెఫ్ హై స్కూల్లో ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గురువును దైవం కంటే మిన్నగా ఆరాధించే సంస్కృతి మనది అన్నారు. అనంతరం ఈరోజు నిర్వహించిన స్వపరిపాలన దినోత్సవం సందర్భంగా విద్యార్థిని విద్యార్థులచే ఉపాధ్యాయులను సన్మానించారు. ఈ సందర్భంగా విద్యార్థినుల సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. ఈ కార్యక్రమంలో స్కూల్ వైస్ ప్రిన్సిపల్ జెరోమియస్, బ్రదర్ దయాబాన్, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
Ramavaram : జాతిని జాగృత పరిచేవాడు గురువు : ప్రిన్సిపాల్ బ్రదర్ రాజశేఖర్ రెడ్డి