ఇల్లెందు, సెప్టెంబర్ 24 : సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరోమారు దగా చేసిందని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి జి.మధు అన్నారు. బుధవారం ఇల్లెందు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వద్ద సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులు, జేఏసీ కార్మికుల ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా రాష్ట్ర నాయకులు జి.మధు, యాకుబ్ షావలి, రామ్ సింగ్ మాట్లాడుతూ.. సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు బోనస్ విషయంలో మరొకసారి రాష్ట్ర ప్రభుత్వం దగా చేసిందని, సింగరేణి లాభాలకు కారణమైన కాంట్రాక్ట్ కార్మికులకు రూ.5,500 బోనస్ ఇవ్వడం సిగ్గుచేటని విమర్శించారు. ఈ కార్యక్రమంలో నాయకులు అబ్దుల్ నబీ, తాళ్లూరి కృష్ణ, మల్లెల వెంకటేశ్వర్లు, పాయ వెంకన్న, రఘు, కాంట్రాక్ట్ కార్మికులు పాల్గొన్నారు.