చండ్రుగొండ, జులై 09 : కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండల కేంద్రంలో వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో బుధవారం జాతీయ రహదారిపై పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం రైతు, ఉద్యోగ, కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాన్ని అవలంబిస్తుందని ఆరోపించారు. దేశవ్యాప్తంగా చేపట్టిన ఆందోళనలో అన్ని వర్గాల ప్రజలు పాల్గొనడం అభినందనీయమన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశ ప్రజలను మత ప్రాతిపదికన విభజిస్తూ పాలిస్తుందని దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలో వామపక్ష పార్టీల నాయకులు, కార్మిక, ఆటో సంఘాల నాయకులు పాల్గొన్నారు.